Neti Satyam
Newspaper Banner
Date of Publish : 15 July 2025, 7:05 am Editor : Admin

ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

విద్యార్థుల భవిష్యత్తు ను ప్రశ్నార్థకము
గా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం…
కొల్లాపూర్, జూలై 15 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి. మల్లికార్జున సాగర్)
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తు ను ప్రశ్నార్థకము గా చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నదని బి.ఆర్.ఎస్.వి జిల్లా నాయకుడు ధారా శేఖర్ విమర్శించారు.
పెండింగ్లో ఉన్న 8500 కోట్ల పైచిలుకు స్కాలర్షిప్ ను, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ మంగళవారం కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ముందు బిఆర్ఎస్వి నాయకులు విద్యార్థిని విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భం గా బిఆర్ఎస్వి జిల్లా నాయకుడు శేఖర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ ఇంటర్ ,డిగ్రీ, పీజీ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం గా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు .
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ లను విడుదల చేయక పోవడం వలన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం గా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చే ముందు వారి మేనిఫెస్టోలో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థులకు అండ దండ గా ఉంటామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 19 నెలలు గడుస్తున్నా విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ గురించి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదని కాంగ్రెస్ పాలకుల పరిపాలన తీరులను శేఖర్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థి యువకులు కలిసి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఈ సందర్భం గా
కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ పాలకులను హెచ్చరించారు.
విద్యార్థులకు రావాల్సినటువంటి 8500 కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రీయిబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెట్టడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని…? ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పాలకులను ప్రశ్నించారు.
వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని , లేని పక్షం లో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని భారత రాష్ట్ర సమితి విద్యార్థి సంఘ నాయకులు ధారా శేఖర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని , పాలకులను హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమం లో బిఆర్ఎస్వి కొల్లాపూర్ మండల నాయకులు జయరాం, మహమ్మద్ సోహెల్, అంజి, అర్జున్, తరుణ్ కొల్లాపూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.