నేటి సత్యం. నాగర్ కర్నూల్ జులై 15 

ప్రతి పథకం ప్రజలకు చేరాలి,
జిల్లా అభివృద్ధి కోసం సమగ్ర చర్యలు అవసరం,
కేంద్ర-రాష్ట్ర పథకాలు సమర్థవంతంగా అమలు కావాలి,
పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా విద్య, వైద్యం, ఉపాధి కల్పిస్తాం,
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు ,
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని, నాగర్ కర్నూల్ జిల్లాను అభివృద్ధి, సంక్షేమంతోపాటు అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలపాలని దిశ కమిటీ చైర్మెన్, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు పేర్కొన్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను అధికారులు సమిష్టి సహకారంతో పనిచేసి లబ్ధిదారులకు అందించాలని మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారు , ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు , డాక్టర్ వంశీకృష్ణ గారు , డీఎఫ్ఓ రోహిత్ గోపిడి గారు , అదనపు కలెక్టర్లు పి అమరేందర్ గారు ,దేవ సహాయం గారు , లతో కలిసి జిల్లా అభివృద్ది సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు నిర్వహించారు.
ఈ సందర్భంగా, జాతీయ రహదారులు, ఎస్సీ కార్పొరేషన్ , వివిధ సంక్షేమ శాఖల రుణాలు విద్య, వైద్య గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం,గ్రామీణ అభివృద్ధి, బ్యాంకర్లు, పంచాయతీ రాజ్,శిశు సంక్షేమం,పౌర సరఫరాలు, పరిశ్రమల శాఖల, అధికారులతో వారు చేపట్టిన పనులపై సమీక్షించారు.
ఆయాశాఖల పనితీరును సమీక్షించిన డాక్టర్ మల్లు రవి గారు ఈసందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రగతిపథంలో ముందుంచాలని, అన్నిరంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందుండాలంటే జిల్లాలో ప్రభుత్వ పథకాలు, పనులు, ప్రభుత్వ ప్రణాళికలు, లక్ష్యాలు అన్నిశాఖలు సాధించి తీరాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తన కు, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. బ్యాంకర్లు జిల్లాలో కేటాయించిన లక్ష్యం మేరకు అన్ని రంగాలకు విరివిగా రుణాలను అందించాలన్నారు.వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిష్కరించే విధంగా పంట రుణాలు, ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు విరివిగా రుణాలు అందించాలని జాతీయ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులకు సూచించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉపాధి యూనిట్ల ఏర్పాటు వల్ల ప్రజలు ఆర్థిక అభివృద్ధితో పాటు జిల్లా ఉపాధి పథంలో ముందుంటుందని, బ్యాంక్ అధికారులు మీ మీ బ్యాంకులకు నిర్దేశించిన టార్గెట్ను రీచ్ అయ్యేలా ప్రణాళికబద్ధంగా పనిచేసే జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. బ్యాంకర్లు చిరు వ్యాపారులకు విరివిగా రుణాలు అందించి, జిల్లా పేద ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చనున్నట్లు వారిని ప్రోత్సాహించాని నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి బ్యాంకర్లను కోరారు.
విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, జిల్లాను ముందుకు నడిపించడం చాలా ముఖ్యమని, ఈ మూడు రంగాలలో అభివృద్ధి సాధించేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని జిల్లా, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ తెలిపారు.
నాగర్ కర్నూలు జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి కావలసిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని నేషనల్ హైవే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అంతరాష్ట్రం రహదారుల నిర్మాణం కోసం మద్దిమడుగు మాచారం బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. 2017 సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు అందించే రుణాల గ్రౌండింగ్ ను పూర్తిచేయాలని, బ్యాంకర్లు ఎస్సీ కార్పొరేషన్ నిధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఎంపీ ఆదేశించారు.
విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ప్రజలకు జ్ఞానం, నైపుణ్యాలు లభిస్తాయి, తద్వారా వారు మంచి ఉద్యోగాలు పొందడానికి, సమాజంలో రాణించడానికి సహాయపడుతుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు,పాఠశాలలు మరియు కళాశాలలను విస్తరించడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, విద్యా విధానాన్ని సమూల మార్పుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ,మరింత మెరుగుపరుస్తున్నామన్నారు.రాష్ట్రంలో విద్యారంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
వైద్యం ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే జిల్లాలో మెడికల్ కళాశాలలో మెరుగైన వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వైద్య విద్యార్థులకు నాణ్యమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ ఇవ్వడం, గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధుల నివారణ మరియు నాణ్యమైన చికిత్సకు చర్యలు తీసుకోవడం ద్వారా వైద్య రంగంలో అభివృద్ధికి బాటలు వేసేలా చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాను అందించాలని, 100% విద్యార్థుల నమోదు ప్రక్రియను చేపట్టి పూర్తిస్థాయిలో విద్యార్థులను నమోదు చేయాలని ఆదేశించారు. ఎలాంటి సమస్యలు లేకుండా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేయాలని ఏవైనా అవసరాలు ఉంటే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనే ఉద్దేశంతోనే ప్రజలు పరిశ్రమలను స్థాపించేలా, నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వడం, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా ఉపాధి రంగంలో అభివృద్ధి సాధించేలా తపనతోనే తాను నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు అభివృద్ధి పరచాలని, జిల్లా కేంద్రంలోనే గతంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేసి పారిశ్రామిక వేత్తలను తయారు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఏర్పాటు చేశానని ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు వెల్లడించారు. ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా చేపట్టాలని, నీటిపారుదల కాలువల ఆధునికీకరణ, పూడిక తీత పనులకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు.
జిల్లాలో అన్నిరంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసే జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని అన్ని శాఖల అధికారులు పరస్పర సహకారంతో ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే దిశగా పనిచేయాలని ఎంపీ మల్లు రవి అన్నారు.అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు వారి శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. గత దిశ సమావేశంలో నిర్దేశించిన అంశాలను శాఖల వారీగా ఎంపీ పురోగతి పనులను సమీక్షించారు.
సంక్షేమ కార్యక్రమాలపై నిరంతర పర్యవేక్షణ,
నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు , లు మాట్లాడుతూ తమ తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న సమస్యలను దిశా కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు మెరుగైన వసతులు సేవలను అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచనలు అందజేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పనులు అవసరమైన ప్రతిపాదనలను వేగవంతంగా చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు ఎమ్మెల్యేలు సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి వైద్యుల పనితీరును మరింత మెరుగుపరచాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రజా ప్రతినిధులము కూడా ఆకస్మిక తనిఖీలు చేపడతామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకాన్ని పెంచేలా పనిచేసే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి వైద్యుడిపై ఉందని, ఆ విధమైన సేవలు అందించాలని సూచనలు చేశారు.
ఈ సమావేశంలో పిడి డిఆర్డిఏ చిన్న ఓబులేసు, దిశ కమిటీ సభ్యులు వంకేశ్వరం మణెమ్మ, యం భగవంతు రెడ్డి, వి. చిన్నయ్య, మాదవత్ మోతీలాల్ వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ ప్రభుత్వ బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.