మంత్రి జూపల్లి గారు ఎవరు జర్నలిస్టులు..?
ఇప్పుడైనా మీకు గుర్తొస్తుందా..?

నేటి సత్యం
కొల్లాపూర్, జులై 18 (యస్.పి. మల్లిఖార్జున సాగర్ ) కొల్లాపూర్ లోని
జర్నలిస్టులను పోలీసులు శుక్రవారం రోజు తెల్ల వారం జాము నుండి అదుపులోకి తీసుకొని కొల్లాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి కొల్లాపూర్ పోలీస్స్టేషన్లో నిర్భందించారు.
జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడం వెనుక ఎవరి “హస్తం” ఉందో జర్నలిస్టులకు ప్రజలకు ప్రజాప్రతినిధులకు సామాజిక ఉద్యమ నేతలతో పాటు మేధావులకు, కొల్లాపూర్ రాజకీయ నేతల భవిష్యత్తును నిర్ణయించే ప్రజలందరికీ తెలుసు.
కొల్లాపూర్ లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేస్తున్న జర్నలిస్టులను జర్నలిస్టులు కారని అన్న కొల్లాపూర్ శాసనసభ్యులు, మంత్రి జూపల్లి కృష్ణారావు కు ఇప్పటికైనా జర్నలిస్టులు ఎవరో గుర్తుకొస్తుందా..? అని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకొని కొల్లాపూర్ పోలీస్స్టేషన్లో నిర్బంధించిన జర్నలిస్టులు అసలైన జర్నలిస్టులా..? లేక పోలీసులు అదుపులోకి తీసుకోకుండా బయట స్వేచ్ఛగా తిరుగుతున్న వారు జర్నలిస్టులా..? ఇప్పటికైనా మంత్రి జూపల్లి కృష్ణారావు గుర్తుకు వచ్చి ఉంటుంది అని మేము అనుకుంటున్నాం.
దీక్షలు చేస్తున్నవారు జర్నలిస్టులు కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించినప్పుడు మరి పోలీసులు దీక్షలు చేస్తున్న జర్నలిస్టులను మాత్రమే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించి పోలీస్ స్టేషన్లో నిర్భందించడం, దీక్షలు చేయని వారిని స్వేచ్ఛగా వదిలివేయడం వలన ఎవరు నిజమైన జర్నలిస్టులు..? అనేది మంత్రి జూపల్లి కృష్ణారావు కు అర్థం కాకున్నా, రాజకీయ నేతల భవిష్యత్తును నిర్ణయించే ఓటర్లకు ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు మేధావులకు అర్థమవు తున్నది అనే విషయాలను కొల్లాపూర్ కు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు మంత్రిగా పనిచేసి నేటికి మంత్రిగా కొనసాగుతున్న అపార అనుభవమున్న మంత్రి జూపల్లి కృష్ణారావు తెలుసుకొని ఇప్పటికైనా జర్నలిస్టుల పట్ల అమానుషము గా ప్రవర్తిస్తూ చులకన గా మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు తన నిరంకుశ ధోరణిని జర్నలిస్టుల పట్ల చూస్తున్న నిర్లక్ష్య భావాలను విడనాడి జర్నలిస్టులకు స్నేహా హస్తం అందిస్తే అది మంత్రి జూపల్లి కృష్ణారావుకు జర్నలిస్టులకు మంచిగా ఉంటుందని జూపల్లి కృష్ణారావు శ్రేయస్సు కోరుకునే మిత్రులుగా కొల్లాపూర్ జర్నలిస్టులుగా మంత్రి జూపల్లి కృష్ణారావుకు గుర్తు చేస్తున్నాం.