Neti Satyam
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 8:14 am Editor : Admin

సొంత రాష్ట్రంలో అక్రమ అరెస్టులా?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*తెలంగాణ నీటి వాటా అడుగుతే అరెస్టులా!*

*స్వరాష్ట్రంలో కూడా తప్పని నీళ్ల పోరాటం.*

*జిల్లా వాసి అయిన సీఎం రేవంత్ రెడ్డి వెల్టూర్ గొందిమల్ల బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలి.*

*కృష్ణా నదిపై రోడ్డు కం బ్యారేజ్ నిర్మించేదాకా పోరాటం కొనసాగిస్తాం!*

*సాధన సమితి నాయకులు మధుగం కాశన్న యాదవ్, పెరుమాళ్ శ్రీనివాస్.*

దక్షిణ తెలంగాణ లో కృష్ణా నది నీటి వాట కై ఏళ్లుగా పోరాడుతున్న స్వ రాష్ట్రంలో కూడా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు తప్పడం లేదని కృష్ణా నదిపై వెల్టూరు గుందిమల్ల బ్యారేజ్ కం రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేపట్టే దాకా పోరాటం కొనసాగుతుందని వెల్టూరు గుందిమల్ల సాధన సమితి నాయకులు మధుగం కాశన్న యాదవ్, పెరుమాళ్ శ్రీనివాస్, పెరుమాల తిరుపతయ్య, మద్దూరు నాగరాజు లు అన్నారు.

శుక్రవారం చిన్నంబావి మండల పోలీస్ స్టేషన్లో సాధన సమితి నాయకులను సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ… పోరాటం సాగిందని, అందులో భాగంగానే వనపర్తి, గద్వాల జిల్లాల పరిధిలో గొంది మల్ల వెల్టూరు దగ్గర రోడ్డు కం బ్యారేజ్ నిర్మించి 50 టీఎంసీల సాగునీళ్లను వాడుకునే వేసులుబాటు ఈ ప్రాంతంలో ఉందని అట్టి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుని దక్షిణ తెలంగాణలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా నది వాటా 512 టీఎంసీల నీటిలో 50 నుండి 100 టి ఎంసీల నీళ్లనువాడుకోవడానికి అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టంలో లేని గోదావరి నీటిని బనకచర్ల ఎడ్ రెగ్యులేటర్ వరకు తరలించే కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందనీ, తెలంగాణ సైతం ఈ వెల్టూరు గుందిమల్ల బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టి వాటా నీటి ఉపయోగానికి ముందుకు సాగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే ఇప్పటికే అల్లంపూర్ x రోడ్ నుండి వయా కొల్లాపూర్,లింగాల మీదుగా నేషనల్ హైవే సైతం డిమాండ్ చేయడంతో సర్వే నిర్వహించరని జాతీయ రహదారి నిర్మాణం కూడా త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాశన్న యాదవ్, పెరుమాళ్ శ్రీనివాస్, పెరుమాల తిరుపతయ్య, మద్దూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.