నేటి సత్యం. శేర్లింగంపల్లి. జూలై
19
అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి మండల్ కౌన్సిల్ ,
వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్రవ్యాప్తంగా జులై 23న జరిగే విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయండి అంటూ ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు నితీష్, ధర్మ తేజ మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని ,
ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, శిథిలావస్తు
ప్రభుత్వ విద్యాలయాలను నూతన నిర్మాణం చేపట్టాలని,
సొంత హాస్టల్ భవనాలను నిర్మించాలని,
విద్యాహక్కు చట్టాన్ని ప్రవేట్ కార్పోరేట్ విద్యాసంస్థలలో అమలు పరచాలనీ ,
25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ,
పూర్తిస్థాయిలో ఎంఈఓ డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని, ఈ యొక్క బందుకు విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలని అని వారు కోరారు.
విప్లవాభివందనాలతో
శేర్లింగంపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు
నితీష్,ధర్మ తేజ