నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై 20


*తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు…గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెక పూడిగాంధీ గారు*
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ రేణుక ఎల్లమ్మ దేవాలయం, సాయి నగర్ శ్రీ ఎర్రపోచమ్మ దేవాలయం, ఆల్విన్ కాలనీ ఫేస్ 2 శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, పాపమ్మ బస్తి మారెమ్మ దేవాలయం, ఎల్లమ్మబండ మహాత్మ గాంధీ నగర్ కాలనీ లో గల శ్రీ కనక దుర్గమ్మ మరియు శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, అంబెడ్కర్ నగర్ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం, శంశిగుడా లోని శ్రీ కట్ట మైసమ్మ దేవలయంలలో జరిగిన బోనాల ఉత్సవాలలో గౌరవ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి తో మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని, PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవలనే ఉద్దేశ్యం తో నియోజకవర్గం లోని ప్రతి గుడికి బోనాల నిధులు మంజూరయేలా కృషి చేశానని ,బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకునేల బోనాలు నిర్వహించుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేయడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాని,గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని మతాల వారు అంగరంగా వైభవంగ పండుగల జరుపుకునేల కృషి చేస్తున్నారు అని ,PAC చైర్మన్ గాంధీ గారు తెలిపారు. తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెలుతున్నారని PAC చైర్మన్ గాంధీ గారు కొనియాడారు.
బోనాల సందర్భంగా ప్రతి గుడి వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండ అన్ని రకాల వసతులు కలిపిస్తూ ప్రశాంత వాతావరణం కలిపించామని, బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేల అన్ని ఏర్పాట్లను చేశామని, బోనాల పండుగ మంచి ప్రశాంత వాతావరణంలో జరిగేవిదంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని PAC చైర్మన్ గాంధీ గాంధీ గారు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.