నేటి సత్యం షాద్నగర్ జులై 21 
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి*
*షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”*
*రేపు షాద్ నగర్ కు మంత్రి శ్రీధర్ బాబు రాక*
*షాద్ నగర్ నియోజకవర్గంలో 3418 మహిళా సంఘాలు*
*మంత్రి ఎమ్మెల్యేల చేతుల మీదుగా రూ. 3 కోట్ల 29 లక్షల చెక్కుల పంపిణీ*
*మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే*
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళాశక్తి పథకంతో మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో 3,418 మహిళా సంఘాలకు గాను జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ల చేతుల మీదుగా రూ. 3 కోట్ల 29 లక్షల చెక్కుల పంపిణీ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణంలోని రోస్ గార్డెన్ లో జరిగే ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల నిర్వహణలో భాగంగా
పలు సంఘాలకు రుణాలు, ప్రమాద బీమా చెక్కులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళల ఆర్థిక ప్రగతి కోసం ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకా న్ని అమలుచేస్తుందని వివరించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు, క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలుకేంద్రాలు, పెరటికోళ్ల పెంపకం, డెయిరీ యూనిట్, పిండి గిర్నీ, మూడు సీహెచ్‌సీలు, స్కూల్ యూనిఫామ్ ఇతర స్వయం ఉపాధి పథకాలతో ఆర్థికంగా భరోసా అందిస్తుందని వెల్లడించారు. షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన, బస్సుల నిర్వహణ, పెట్రోల్ బంక్, ఇంకా మండల స్థాయిలో అనగా గ్రూపులకు ఎంటర్ప్రైజెస్ తదితర వ్యాపార కేంద్రాలను పెట్టిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 3418 సంఘాలు రుణాలు సకాలంలో చెల్లించడంతో రూ 3.29 కోట్ల వడ్డీ ప్రభుత్వం తిరిగి చెల్లించనుందని అన్నారు. రుణాలు చెల్లించడంలో జిల్లా రాష్ట్రంలో షాద్ నగర్ ప్రత్యేకంగా నిలిచిందని తెలిపారు. ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ఉచిత బస్సు, విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందజేస్తు న్నదని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి కింద అందిస్తున్న ఆర్థికసహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాము ఉపాధి పొందుతూ మిగతా వారికి పని కల్పించే స్థాయికి మహిళలు ఎదుగుతున్నారని వివరించారు. ప్రత్యేక ప్రణాళిక ప్రకారం మహిళా సంఘాలకు ఆర్థిక ప్రగతి లభించే విధంగా చూస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా మూడువేల 3418 సంఘాలకు గాను 3.29 కోట్ల రూపాయలు చెక్కులు రేపు అందజేస్తామని తెలిపారు. కేశంపేట మండలంలో 766 సంఘాలకు గాను 68 లక్షల పైచిలుకు చెక్కులు అందజేస్తామని, అదేవిధంగా కొత్తూరు మండలంలో 345 మహిళా సంఘాలకు గాను 39 లక్షల రూపాయలు, చౌదరిగుడ మండలంలో 46 సంఘాలకు గాను 47 లక్షలు, కొందుర్గు మండలంలో 382 సంఘాల గాను 39.94 లక్షల రూపాయలు, నందిగామ మండలంలో 472 సంఘాలకు గాను 44.55 లక్షల రూపాయలు చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మహిళా సంఘాల సభ్యులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు.