నాగర్ కర్నూల్ జిల్లా సిపిఐ మహాసభలను జయప్రదం చేయండి
నేటి సత్యం. నాగర్ కర్నూల్. జులై 21
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ,100 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో జరిగే ఆగస్టు 1, 2వ ,తేదీలలో సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయండి,
ఎం బాల నరసింహ
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కామ్రేడ్, లక్ష్మణాచారి భవన్లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం కే, యేసయ్య అధ్యక్షతన జరిగింది,
జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం బాల నరసింహా పాల్గొని మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలో జరగబోయే ఆగస్టు 1,2 తేదీలలో జరిగే నాగర్ కర్నూల్ జిల్లా మూడో మహాసభలను విజయవంతం చేయాలని కోరారు,
ఎన్నికల ముందు వచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి, కేంద్ర ప్రభుత్వం అధికారం కు వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకుండా హిందూ, ముస్లిం మతాల మధ్య స్విచ్ పెడుతూ ప్రజా పాలనను గాలికి వదిలేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతు భరోసా రుణమాఫీ నిధులు విడుదల చేసి రైతులకు బ్యాంకు అకౌంట్ లో జమ చేయాలని అన్నారు,
భారత కమ్యూనిస్టు పార్టీ,( సిపిఐ ) 1925 డిసెంబర్ 26, 2025 డిసెంబర్ 26 100 ఏళ్ళు చరిత్ర కలిగి న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్కటి భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని గర్వంగా చెప్పగలము, నిత్యం అనేక ఉద్యమాలు పోరాటాలు హక్కులు కోసం ఎన్నో ప్రాణం త్యాగాల తోటి 1,500 మంది వీరమరణం పొందారు, భారత కమ్యూనిస్టు పార్టీకి పేదల పక్షాన పోరాడిన ఏకైక పార్టీ సిపిఐ, ఎప్పటికీ చరిత్రలో ప్రజల మధ్యనే పదిలంగా ఉంటుందని ఆయన అన్నారు,
ఆగస్టు ఒకరి తేదీ న భారీ ర్యాలీతోపాటు బహిరంగ సభ హైదరాబాద్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్లలో ఉంటుంది, అందుకు గాను జిల్లా వ్యాప్తంగా సిపిఐ కార్యకర్తలు సానుభూతిపరులు అత్యధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు,
బహిరంగ సభ ప్రజానాట్యమండలి కళాకారులు బృందంతో ఆటపాటలతోటి వివిధ కళారూపాలలో ప్రదర్శనలు ఉంటాయి,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే, కే,సాంబశివరావు, సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, హాజరవుతున్నారు,
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, హెచ్ ఆనంద్ జీ, వార్ల వెంకటయ్య, కే కేశవులు గౌడ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టీ, నరసింహ, ఆర్ ఇందిరమ్మ,ఈర్ల చంద్రమౌళి, కొమ్ము భరత్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పి కృష్ణాజి, టీ శివుడు, బోల్లెద్దుల శ్రీనివాసులు, వీ రవీందర్, ఎండి, కుద్బుద్దిన్, డి బాలమురళీకృష్ణ, సూర్య శంకర్ గౌడ్, ఫుల్జాల పరశురాములు, మారేడు, శివ శంకర్, బండి లక్ష్మీపతి, మధు గౌడు ప్రేమ్ కుమార్, డి,ఆంజనేయులు, డి వెంకటస్వామి, చిన్నపాగ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు,
