*గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీ లో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల మహోత్సవ కార్యక్రమం*
నేటి సత్యం. శేర్లింగంపల్లి. జులై 21
నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వి జగదీశ్వర్ గౌడ్ శేరీ లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులైన కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఉత్సాహంగా సంతోషంగా జరుపుకున్న కాలనీ ప్రజలు.
నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, సాయిబాబా ఆలయ ప్రధాన అర్చకులు రాఘవేంద్ర శర్మ, అమ్మవారి ఆలయ అర్చకులు సందీప్ తివారి, రాజు శర్మ, ఉపాధ్యక్షులు రాయుడు, కే నరసింహ యాదవ్, రవి నాయక్, కావాటి చంద్రశేఖర్ యాదవ్, ఫోటో స్టూడియో వెంకటేష్ ముదిరాజ్, తెలుగు సుభాష్ ముదిరాజ్, నరేందర్ యాదవ్, సత్తెమ్మ, జయా రెడ్డి, చిట్టెమ్మలాల్ రెడ్డి, రాధా రాణి రెడ్డి, మని మేఘమాల, శారద, ప్రసాద్ యాదవ్, భేరి శ్రీనివాస్ యాదవ్, నరేష్ నాయక్, రవి నాయక్, అన్నదొర, తిరుమలేష్, దయాసాగర్, గణేష్ నాయక్, బాలరాజ్ నాయక్, కార్పెంటర్ ప్రసాద్ చారి, విట్టల్ నాయక్, రాజు నాయక్, డీజే భవన్, రాజు, లవణాచారి, భేరి చంద్రశేఖర్ యాదవ్ బ్యాండ్ మేళం రాజు బృందం, పెద్ద ఎత్తున కాలనీవాసు
లందరూ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ నల్ల పోచెమ్మ తల్లి బోనాల జాతర ఉత్సాహం పండుగ వాతావరణం లో ఘనంగా జరుపుకోవడం కనులవిందయింది. కాలనీ మొత్తం బోనాల ఊరేగింపులో ఆ అమ్మవార్ల భక్తిలో తరించిపోయింది.కరీంనగర్ కొండా రవి యాదవ్ బృందం ఒగ్గు కళాకారుల పోతురాజుల కోలాహటాలు డప్పు చప్పుళ్లు మరియు డీజే ద్వారా కాలనీ నిండుగా అమ్మవార్ల
పాటలతో ధూమ్ ధామ్ గా ఉర్రూతలూగించే డాన్స్ లతో కాలనీవాసులు ఆనందంతో సంతోషంతో కేరింతలు కొడుతూ పండుగ జరుపుకున్నారు.
అమ్మవారికి మేక పోతుల బలీ, కోడిపుంజులతో బలి ప్రసాద రూపంలో తెలంగాణ సాంస్కృతి తరతరాలుగా వస్తున్న అమ్మవార్ల బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనంద్ దాయకం.
ఈ కార్యక్రమానికి
లోకల్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వి జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, బిజెపి పార్టీ బంజారా మోర్చా అధ్యక్షులు హనుమంత నాయక్, మరియు ప్రజా ప్రతినిధులు హాజరై పూజ చేసి అమ్మవారికి బోనం సమర్పించారు.
శేరి లింగంపల్లి
కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి పూజలు చేశారు. హైటెక్ సిటీ మాదాపూర్ కార్పొరేటర్లు పూజితగారు, జగదీశ్వర్ గౌడ్, దంపతులు అమ్మవారి సేవలో పాల్గొని పూజలు చేసి బోనం సమర్పించారు.
ఆహ్వానితులు పెద్దలు మహిళా సంఘాలు యువజన సంఘాలు ముఖ్యంగా శేరీ లింగంపల్లి ప్రాంతం నుండి అనేకమంది అభిమానులు మహిళామణులు పెద్దలు యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఘనంగా పూజలు చేయడం గొప్ప విశేషం. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ ఎన్ ఎన్ రెడ్డి టెక్స్టైల్స్ ప్రోప్రైటర్ కుషన్ రెడ్డి, మౌలానా, వేలు, పాల్గొని పూజలు చేశారు.
కాలనీ ఉప అధ్యక్షులు నరసింహయాదవ్, రాయుడు మరియు ఆలయ కమిటీ సభ్యులందరూ పాల్గొని కాలనీ
బోనాలతో ఊరేగింపుగా వచ్చు పూజలు చేసి బోనాలు సమర్పించి జాతర ఉత్సవ వాతావరణంలో బోనాల పండుగను సంతోషంగా నిర్వహించడం జరిగింది నేతాజీ నగర్ లో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా సహకరించిన కాలనీ పెద్దలకు మహిళా సోదరులకు యువజన నాయకులకు చందానగర్ పోలీస్ వారికి మరియు జిహెచ్ఎంసి మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసినారు బేరి రామచందర్ యాదవ్.