(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దాశరధి కృష్ణామాచార్యులకు సిపిఐ ఘన నివాళి
నేటి సత్యం హైదరాబాద్. జూలై 22
మహా కవి దాశరధి కృష్ణామాచార్యులు తెలుగు, వెలుగు అని, ఆయన తెలుగు భాషాకే వన్నే తెచ్చిన గొప్ప కవి అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మలు ప్రశంసించారు. మహాకవి దాశరధి కృష్ణామాచార్యుల శత జయంతి ని పురస్కరించుకుని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ మంగళవారం ఆయన చిత్రపటానికి చాడ వెంకరెడ్డి, పశ్య పద్మ, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లీ ఉల్లా ఖాద్రీ, డిహెచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరసింహారెడ్డి, బాతరాజు నర్సింహా, కార్యాలయ కార్యదర్శి గోవింద్, శ్రీరాములు, దశరధ్ తదితరులు పాల్గొన్నారు.
*దాశరధి కృష్ణామాచార్యులు ఎప్పటికీ ఆదర్శ ప్రాయులే ః చాడ వెంకటరెడ్డి*
ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దాశరధి రాసిన అనేక కవితలు, రచనలు అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ యువతకు ఆదర్శ ప్రాయమన్నారు. ఆయన రచనలు, కవితలు సామాజిక సృహా కలిగిన సాంస్కృతిక విప్లవానికీ నాంది పలికినట్టుగా, చైతన్యానికి నిదర్శనమని అన్నారు. నాడు నైజాం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ లాంటి అనేక గేయాలను రాసి ప్రజలను చైతన్యవంతులను చేసి, వారి హక్కుల కోసం ఉద్యమ బాట పట్టించడంలో ప్రధాన పాత్ర పోషించారని గుర్తు చేశారు. వారి ఆశయాలను కొనసాగించేందుకు అభ్యుదయ రచయిత సంఘం పెద్ద ఎత్తున దాశరధి శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు. సిపిఐ కూడా దాశరధి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని కొనసాగిస్తుందంటూ చాడ వెంకటరెడ్డి జోహర్లు అర్పించారు.
*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిరుపేదలకు వేగు చుక్క ః పశ్య పద్మ*
పశ్య పద్మ మాట్లాడుతూ దాశరధి కృష్ణామాచార్యులు తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో నిరుపేదల ప్రజలకు వేగు చుక్కలాంటి వారు అని అన్నారు. అన్నార్ధులు, అనాదలు లేని సమ సమాజమే ‘నా ధ్యేయమని’ చాటి చెప్పిన వామపక్ష భావాల కేంద్రం దాశరధి కృష్ణామాచార్యులు అని కొనియడారు. “ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో…. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో … భూగోళం పుట్టక కోసం రాలిన సుర గోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో … ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో ” అనే గేయం ద్వారా యువత విప్లవాగ్ని రగిలించిన గొప్ప రచయిత దాశరధి అని అన్నారు. విద్యార్ధి దశలో నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులను మాటను దిక్కరిం