Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorized200 కోట్ల మంది మహాలక్ష్మి లు ప్రయాణం 6700 కోట్ల ఖర్చు

200 కోట్ల మంది మహాలక్ష్మి లు ప్రయాణం 6700 కోట్ల ఖర్చు

నేటి సత్యం. జూలై 23

*హై స్పీడ్ లో ఉచిత బస్సు..!*

*200 కోట్ల మంది మహాలక్ష్మిలు ప్రయాణం*

*వారికోసం అయిన ఖర్చు రూ. 6,700 కోట్లు*

*నేడు రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు 341 బస్ స్టేషన్లలో సంబరాలు*

*షాద్ నగర్ బస్ స్టేషన్ లో ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో సంబరాలు*

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో 200 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణం చేశారని
షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణ ఖర్చు రూ.6700 కోట్లని తెలిపారు. విజయ వంతంగా కొనసాగుతున్న మహాలక్ష్మీ పథకం అమలులో భాగంగా నేడు (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టిసి డిపోలతోపాటు 341 బస్ స్టేష న్లలో సంబురాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చినట్టు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేసిన మొట్టమొదటి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 9 డిసెంబర్ 2023 నుండి విజయవంతంగా అమ లవుతుందన్నారు. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని.. రూ.6700 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. ఆర్టీసికి మహిళా ప్రయాణికుల రియంబర్స్మెంట్ ను
ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందన్నారు. సంస్థలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నూతన బస్సుల కొనుగోలు చేస్తూ మహాలక్ష్మి పథకం విజయవంతం కోసం కృషి చేస్తున్న ఆర్టీసి డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్ లు, ఇతర సిబ్బంది, అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అభి నందించారనీ ఎమ్మెల్యే శంకర్ గుర్తు చేశారు. సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం ప్రథమ కర్తవ్యంగా ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు వడుతున్నాయని.. దూర ప్రాంత ప్రజలు కూడా నిత్యం నగరానికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ
ఆర్టీసీ వృద్ధి సాధించడం అభినందనీయమన్నారు. ప్రతి మహిళా నెలకు రూ. 45 వేల వరకు ఉచిత ప్రయాణం ద్వారా ఆదా చేసుకుంటూన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రయాణం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్సు డిపోలు, 341 బస్ స్టేషన్లలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆర్టీసీ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ పిలుపునిచ్చినట్టు తెలిపారు. అందులో భాగంగా బస్ స్టేషన్లు, డిపోలు మొదలైన వాటిలో బ్యానర్ల ప్రదర్శన చేయాలని.. అన్ని డిపోల్లో ముఖ్యమైన బస్ స్టేషన్లలో సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సంబురాల కార్యక్రమాల్లో స్థానిక ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు సమావేశానికి ఆహ్వానించాలని.. మహిళా ప్రయాణీకులతోపాటు ప్రయాణికుల ప్రసంగాలను ఏర్పాటు చేయడం కూరగాయల విక్రేతలు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు, వ్యాపార మహిళలు, పట్టణ ఆసుపత్రులకు మెరుగైన చికిత్స కోసం వెళ్లే మహిళలు, యాత్రికులు వంటి వివిధ వర్గాలకు చెందిన వారు తమ ప్రసంగాలలో తమ ప్రయాణ అనుభవాలను పంచుకోవాలన్నారు. డిపోలు, ముఖ్యమైన బస్ స్టేషన్లలో మహిళా ప్రయాణికులను శాలువా, బహుమతితో సత్కరించనున్నట్టు తెలిపారు. మహాలక్షి ్మ ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, రంగోలి, చిత్రలేఖనం పోటీలను నిర్వహించాలన్నారు. పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, పెన్ సెట్లు మొదలైన బహుమతులతో 5 మంది బహుమతి గ్రహీతలను సత్కరించాలని సూచించారు. పథకం విజయవంతానికి దోహదపడిన ప్రతి డిపోలోని 5 మంది ఉత్తమ డ్రైవర్లు, 5 మంది ఉత్తమ కండక్టర్లతో పాటు ట్రాఫిక్ గైడ్లు, భద్రతా సిబ్బందిని సత్కరించాలని అధికారులను ఆదేశించారు.
18 నెలల ప్రజా పాలనలో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటిందని.. ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటం ఆనందంగా ఉందని అన్నారు. ఈ పథకంలో లబ్దిదారులైన ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు.. ఈ పథకాన్ని.. దిగ్విజయంగా అమలు చేయడంలో.. భాగస్వాములైన.. ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు అంటూ షాద్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ లో కూడా సంబరాలు ఏర్పాటు కార్యక్రమానికి హాజరవుతానని ఎమ్మెల్యే శంకర్ అన్నారు.. *RK

*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments