Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 July 2025, 8:46 am Editor : Admin

విద్య సంస్థల బంద్ విజయవంతం ఏఐవైఎఫ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం జూలై 23

*ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం*

*విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ*

*వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్*
రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి

నేటి సత్యం. హైదరాబాద్. జిల్లా 23

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు,జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని,రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాపిత పాఠశాలు,జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం అయిందని, కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇప్పటికీ విద్యారంగంపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నదని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర లు ఆరోపించారు.బంద్ సందర్భంగా హిమాయత్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాల,కాచిగూడా లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థుల తరగతులను బహిష్కరించి, నినాదాలు చేస్తూ బంద్ ను విజయవంతం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర* లు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని అనేక సంవత్సరాలుగా విద్యార్థి, యువజన సంఘాలు పోరాటాలు చేస్తున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోకడం వల్లనే విద్యారంగం కుంటుపడిందని,దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవివేకమని వారు ఆరోపించారు.అదే విధంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ,ఎంఇఓ, డీఈఓ, తదితర పోస్టులను భర్తీ చేయాలని, ఇంటర్మీడియట్ కళాశాలల్లో అవినీతిని, గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 8వేల కోట్ల రూపాయల విద్యార్థుల ఉపకార వేతన బకాయిలను, బోధనా రుసుములను లను విడుదల చేయాలని,రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించి,నిధులు కేటాయించాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చేయాలని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, యూత్ డిక్లరేషన్ ను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమాన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ మహమూద్, వంశీ, అరుణ్, చెట్టుకింది శ్రీనివాస్, పాల్గొన్నారు.