(adsbygoogle = window.adsbygoogle || []).push({});
* నేటి సత్యం శేర్లింగంపల్లి ప్రతినిధి ఆర్కే జూలై 23 

*శేరిలింగంపల్లిలో నేటి విద్యాసంస్థల బందు విజయవంతం*
*పెండింగ్లో ఉన్న 8 వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి*
*హాస్టల్ విద్యార్థులకు మేస్ చార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి*
*టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి*
*ఏఐఎస్ఎఫ్ శేర్లింగంపల్లి ప్రెసిడెంట్ కార్యదర్శి టి నితీష్ ధర్మ తేజ* *
నేటి సత్యం. శేర్లింగంపల్లి. జూలై 23
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంధు విజయవంతం
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజీలలో నెలకొన్న సమస్యలతో పాటు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు చేసే ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న పిలుపునిచ్చిన విద్యాసంస్థల బందు విజయవంతం అయిందని అన్నారు సందర్భంగా , శేర్లింగంపల్లి అధ్యక్ష కార్యదర్శి, టీ నితీష్ ధర్మ తేజ మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
బకాయి ఉన్న 8 వేలకోట్ల విద్యార్థుల స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయి కావున హాస్టల్ విద్యార్థులకు మేస్చార్జులు మరియు కాస్మోటిక్ చార్జీలు పెంచాలని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలో మౌలిక సదుపాయాలను కల్పించి, ఆర్టీసీ లో విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో . టి గణేష్. పి సురేష్. కిరణ్.విష్ణు(RK)