నేటి సత్యం సరూర్నగర్ జులై 23

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ విజయవంతం AISF SFI PDSU
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సరూర్నగర్ మండలం లో బి.యన్ రెడ్డి నగర్ , కర్మన్ఘాట్, ఎల్బీనగర్, సరూర్నగర్ ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ జూనియర్ కళాశాలలో బంద్ నిర్వహించడం జరిగింది.
అనంతరం ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి కుమార్ , ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్ వారు మాట్లాడుతూ
ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ విద్యాలయాల నిర్మాణం శూన్యమని నేటికీ విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేకపోవడం కిటికీలు ప్రహల్లారి గోడలు విద్యార్థులకి టాయిలెట్స్ కెల్లడానికి నేటికీ కూడా బాత్రూమ్స్ లేనటువంటి పరిస్థితి , అబ్బాయిలు నేటికీ టాయిలెట్స్ బయటకు వెళ్తున్నారు. ప్రభుత్వం ఇంత అభివృద్ధి చెందుతుంది అన్న విద్యార్థినీ విద్యార్థుల విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రభుత్వ విద్యాలయాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్పించడానికి వెనకడుగు వేస్తున్నారు. ఒకరకంగా ప్రభుత్వ విద్యను ఖూనీ చేస్తూ కార్పొరేట్ ప్రవేట్ విద్యాసంస్థలకు పరోక్షంగా సహకారాలు అందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాల గురించి ఒకసారి కూడా ఆలోచించకుండా గురుకులాల్లో అనేక మైనటువంటి సమస్యలు పునరావతమైంది. నేటికీ గురుకులాల్లో భోజనం బాగోలేక ఎంతమంది విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు. ఫీజు రీయింబర్స్, స్కాలర్షిప్ 8500 కోట్ల రూపాయలు నేటికీ పెండింగ్ ఉన్నాయి. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు నేటికీ కూడా ఫీజు రీయింబర్స్ రాక తల్లిదండ్రులు అప్పులు తెచ్చి ప్రవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో లక్షల ఫీజులు కడుతున్నారు, ఆర్థికంగా లేనివారు నేటికీ సర్టిఫికెట్లు ఆయా కళాశాలల వద్దనే ఉన్నాయి. జాబులు వచ్చిన బయటికి వెళ్లినటువంటి పరిస్థితి, ఓవర్సీస్ స్కాలర్షిప్ బయట దేశాలకు వెళ్ళిన విద్యార్థులకి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం నేటికీ అనేకమంది విద్యార్థులకి అందక బ్యాంకులలో వడ్డీలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ఇచ్చింది. కానీ విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచింది. వామపక్ష విద్యార్థి సంఘాలుగా విద్యార్థులకి కూడా ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని , ఎంఈఓ డిఈఓ టీచర్స్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రవేట్ కార్పొరేట్ విచ్చలవిడిగా నిర్మాణ నిబంధనలు పాటించని పాఠశాలలు కళాశాలలకు అనుమతులు ఇవ్వడం సిగ్గుచేటని విద్యార్థుల ప్రాణాలను లెక్కచేయకుండా పాఠశాలలు కళాశాలలు తరగతులు బోధించడానికి వీలుగా లేనటువంటి ప్రాంతంలో అనుమతులు ఇస్తున్నారు అని . ప్రవేట్ ,కార్పోరేట్ పాఠశాలలో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి ఫ్రీ ఇవ్వటం లేదు. ప్రవేట్ కార్పోరేట్ పాఠశాల కళాశాలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని , అదేవిధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని 2020 రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి వద్దనే ఉన్న వారు టైం కేటాయించలేనటువంటి పరిస్థితి, నేటికీ విద్యాభివృద్ధి కొరకు ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవని నూతన ప్రభుత్వ విద్యాలయాలను ప్రారంభించిన పరిస్థితులు కూడా లేవని వారు అన్నారు.ఈ కార్యక్రమంలోAiSF సరూర్నగర్ మండల కార్యదర్శి పి.వినోద్,SFi అభిలాష్ ,మిథున్ ,విక్రమ్,తరుణ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.