Neti Satyam
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 7:32 am Editor : Admin

సిపిఐ రంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభలను జయప్రదం చేయండి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*సిపిఐ రంగారెడ్డి జిల్లా 4వ. మహాసభలను జయప్రదం చేయండి*.

నేటి సత్యం. గచ్చిబౌలి. జూలై 25

భారత కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా. నాలుగవ మహాసభ 2025 ఆగస్టు 2న. మొయినాబాద్ మండల కేంద్రంలో అంజనీ దేవి గార్డెన్లో ఉదయం 9 గంటలకు జరుగుతుంది..
మహాసభను శేరిలింగంపల్లి నియోజకవర్గం. సిపిఐ శ్రేణులు పాల్గొని. విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి.
2024 డిసెంబర్ 26 నాటికి. 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందిసిపిఐ. దేశంలో 100 సంవత్సరాల ఉద్యమ పార్టీగా సిపిఐ ఖ్యాతి పొందింది. స్వాతంత్రం కొరకు జరిగిన పోరాటంలో ఆనాడే అనేకమంది ఉరి కమ్మలు ఎక్కి ప్రాణ త్యాగాలు చేసిన వీర చరిత్ర గలది భారత కమ్యూనిస్టు పార్టీ
శేర్లింగంపల్లి నియోజకవర్గంలో. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో. ఇల్లు లేని నిరుపేదలకు. ఇళ్ల స్థలాల కొరకై.. ఎన్నో ఉద్యమాలు చేసి 20 బస్తీలను నెలకొల్పిన చరిత్ర సిపిఐ కి దక్కింది .
ఆటో కార్మికులను కూడగట్టి. ఎన్నో ఆటో స్టాండ్లను నిర్మించిన జీవన ఉపాధి కల్పించినది సిపిఐ.
ప్రజా సమస్యలపై. బస్తీల.సమస్యలపై. రేషన్ కార్డులు వితంతు పింఛన్లు. హెల్త్ కార్డు. రోడ్లు డ్రైనేజీ. వీధి దీపాలు. ఇలా అనేక సమస్యలపై నిరంతరం ప్రజా ఉద్యమాలు చేసి పరిష్కరించిన ఏకైక పార్టీ సిపిఐ.
ఆగస్టు 2న జరిగే .. మహాసభలో చేసే నిర్ణయాలను. ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని.. అన్నారు
ఈరోజు ఉదయం 10 గంటలకు. గచ్చిబౌలి సిపిఐ ఆధ్వర్యంలో. మహాసభ కరపత్రాల విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. మండల కార్యదర్శి సిపిఐ రామకృష్ణ మండల సహకార దర్శి కే చంద్ర యాదవ్. హాజరైనారు.
అనంతరం కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కృష్ణ నాయక్. బాలు రాజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు