Neti Satyam
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 10:17 am Editor : Admin

పేద కార్మికుల సమస్యలను పరిష్కరించి సంక్షేమ పథకాలు అందేలా చూడండి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం.
హైదరాబాద్ జూలై 25

*పేద కార్మికుల సమస్యల పరిష్కరించి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మంత్రికి వినతి పత్రం అందించిన చైర్మన్ కే లక్ష్మయ్య బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందం..*

పేద కార్మికులు వర్కర్ల గురించి సంక్షేమ పరంగా సహాయం చేయాలని కార్మిక ఉపాధి శాఖ మంత్రి గారిని
కలిసి వారి సమస్యలను విన్నవించిన జాతీయ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం చైర్మన్ కే లక్ష్మయ్య బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందం. భవన నిర్మాణ కార్మికులు మరియు పేద కూలీలు, కార్మిక వర్కర్లకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందేలా సహాయపడాలని కోరారు. కార్మికులు మరియు పేదలకు కూలీలను అన్ని విధాల ఆదుకోవాలని బీసీ ఫెడరేషన్ మరియు బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్మిక శాఖ మాత్యులు వివేక్ గారికి మేమోరాండం సమర్పించడం జరిగింది. పేదలైన భవన నిర్మాణ కార్మికులు మరియు కూలీలకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
*భవన నిర్మాణ కార్మికులు మరియు కూలీల డిమాండ్స్ కు పరిష్కారం చూపాలి..*
01. డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలని అన్ని విధాల సహాయ పడాలని కోరడం జరిగింది.
2. విద్య విషయంలో పేదలకు కార్మిక సోదర సోదరీమణుల వారి పిల్లలకు హాస్టల్లో సీట్లు కేటాయించి ఉచిత విద్య నేర్చుకునే విధంగా సహాయం చేయాలని పేర్కొనడం జరిగింది.
3. వైద్యం విషయంలో ఇన్సూరెన్స్ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిలో ఉన్న వర్కర్స్ కు హాస్పిటల్స్ లో చికిత్స చేసుకోవడానికి సహాయ పడాలని మనవి చేయడం జరిగింది.
4. విదేశీ విద్యలకు 20 లక్షల రుణం మంజూరు చేయాలని కోరడం జరిగింది.
5. సంఘాలకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి సంక్షేమం దృష్టితో సహాయ పడాలని కోరడం జరిగింది
6. గర్భిణీ స్త్రీలకు కాన్పు ఖర్చుల కింద లక్ష రూపాయలు కేటాయించాలని పేర్కొనడం జరిగింది
7. యాక్సిడెంట్లో మరణించిన కార్మికులకు 10 లక్షల సాయం అంబులెన్స్ ఖర్చులు కూడా భరించాలని కోరడం జరిగింది .
8. ప్రమాదం జరిగి ప్రాణం కోల్పోయినప్పుడు లేదా కాలుచేయి అవయవ లోపం జరిగిన కూడా అన్ని విధాల సహాయం చేయాలని కోరడం జరిగింది. అవసరం ఉన్నంతవరకు పేదలైన కార్మికులకు మరియు వర్కర్స్ కు సహాయ పడాలని ప్రభుత్వం ద్వారా అన్ని విధాల ఆదుకోవాలని మంత్రికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, చైర్మన్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి అనంతయ్య, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, మాజీ డిఎస్పి పోలీస్ బంటు రాములు, అనంతయ్య కుమార్ యాదవ్, కార్యదర్శి మేకు నరే ఆనంద్, రాష్ట్ర కార్యదర్శి కాశీనాథ్, జిహెచ్ఎంసి ప్రధాన కార్యదర్శి కిషన్, సలహాదారు అనంతయ్య, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున రావు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి కిష్టయ్య గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ప్రదీప్ మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్మిక సోదరులు కలిసి మెమొరండం సమర్పించడం జరిగింది.