నేటి సత్యం. 
*యువత కు పట్టం కట్టిన సిపిఐ*
నేటి సత్యం. ఇబ్రహీంపట్నం. జూలై 25
ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి గా కావలి సురేష్
సహాయ కార్యదర్శులుగా జంగిలి ప్రవీణ్ కుమార్, శివరాల సూర్యం లు ఏకగ్రీవ ఎన్నిక
నూతనోత్తేజంతో బలం పుంజుకోనున్న సిపిఐ
ఇబ్రహీంపట్నం మండల సిపిఐ పదకొండవ మహాసభలు మండల కేంద్రం లో నేడు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో నూతన కమిటీ లో భాగంగా మండల కార్యదర్శి గా కావలి సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కావలి సురేష్ స్వగ్రామం పోల్కంపల్లి తన తండ్రి కావలి నర్సింహా ప్రస్తుత సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గారి నుండి చిన్న నాడే రాజకీయ ఓనమాలు నేర్చుకొని ఎర్రజెండా వరసత్వాన్ని పునికి పుచ్చుకొని విద్యార్థి యువజన ఉద్యమాలాల్లో ( ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ )పాల్గొని అనేక కార్యక్రమాలు చేశారు. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నుండి కౌన్సిలర్ గా పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షం గా పోటీ చేసి గెలిచిన రంగారెడ్డి గెలుపు కోసం చాలా కష్టపడ్డారు.నేడు జరిగిన మహాసభలో పార్టీ మండల కార్యదర్శి గా ఎన్నిక చేయడం అభినందించదగ్గ విషయం స్థానిక నాయకులు ప్రజలతో అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించి ప్రజలకి మరింత సేవ చేసి ఎర్రజండా ని ఇబ్రహీంపట్నం లో రేపరేపలాడించాలని కోరుకుందాం.