నేటి సత్యం

*ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారి మరణం బహుజన సమాజానికి తీరని లోటు*
* *ప్రభంజన్ యాదవ్ గారి సంస్మరణ సభలో బి యల్ యప్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్*
నేటి సత్యం. హైదరాబాద్. జులై 25
ఓంకార్ భవన్ బి యన్ హల్ బాగ్ లింగం పల్లి హైదరాబాదు లో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారి సంస్మరణ సభ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ( బి యల్ యప్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.
* ఈ సందర్భంగా వారి చిత్రపటానికి బి యల్ యప్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ గారు పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు బహుజన సమాజం ఎంతో కృషి చేశారు అని, డిల్లీ లో, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉద్యోగం చేస్తు మండల్ రిజర్వేషన్ సమస్య వచ్చినపుడు ఖచ్చితంగా మండల్ కమీషన్ సిఫార్సులను అమలు చేయాలని సాగిన పోరాటం లో బిసి బిడ్డగా బహుజన సమాజం కోసం పోరాడిన వారిని వారు తెలంగాణ ఏర్పాటు లో జరిగిన అనేక ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ లో సామాజిక తెలంగాణ కావాలని గట్టిగా పోరాడిన వ్యక్తి ప్రభంజన్ యాదవ్ గారు అని ఆయన మరణం తీరని నష్టాన్ని కలిగించిందని అన్నారు.
* యంసిపిఐ ( యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి గారు, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు జి. రాములు గారు,బిసిపి రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు గారు, ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి,దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి పి.శంకర్ గార్లు మాట్లాడుతూ నేడు బి సి రిజర్వేషన్లు, బహుజన సమాజం కోసం ఏ లాంటి అవకాశవాదం తో కాకుండా నీతి నిజాయితీ గా పోరాడిన వ్యక్తి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు అని అన్నారు, బిసి ల కోసం టీవి, స్టడీ సర్కిల్సు నిర్వహణకు ఎంతో కృషి చేశారు అని ఆలాంటి ప్రభంజన్ యాదవ్ గారు మధ్యంతరం గా మరణించిన తీరు చాలా ద్రిగ్బాంతి కలిగించింది అని, నేడు బిసి సమాజం అనేక అసమానతలు ఎదుర్కొంటున్న సమయంలో వారి మరణం చాలా నష్టం అని, వారి ఆదర్శాలను, విధానాలను పుణికి పుచ్చుకొని ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు.
* ఈ సంస్మరణ సభలో బి యల్ యప్ రాష్ట్ర నాయకులు కుంభం సుకన్య, వాంకుడోతు తుకారాం నాయక్, తాండ్ర కళావతి, కర్ర దానయ్య మారోజు సునిల్, వరికల్ గోపాల్, బర్రె సంజీవ, గ్యార సాలయ్య, తదితరులు పాల్గొన్నారు.