నేటి సత్యం
*నాగర్ కర్నూలు జిల్లా.. జూలై 25 ..*
*ప్రతి వాణిజ్య సముదాయం ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి*
*మునిసిపల్ కమిషనర్ నాగిరెడ్డి*
పట్టణంలోని దుకాణ యజమానులు,
కమర్షియల్ ఎస్టాబ్లిహ్మెంట్స్ ట్రేడ్ తప్పనిసరిగా తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు పురపాలక సంఘ కార్యాలయం సిబ్బంది పట్టణంలో లైసెన్స్ తీసుకోని వారిని గుర్తించి లైసెన్స్ తీసుకోవాలని తెలియజేస్తున్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రగతి హాస్పిటల్ లైసెన్స్ కు సంబంధించి రూ..1,93,125 లు చెల్లించి వారి ట్రేడ్ ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ… పట్టణంలోని దుకాణ యజమానులు ఈ విధంగా ముందుకు వచ్చి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శివశంకర్, వార్డు ఆఫీసర్ సాయిరాం, సిబ్బంది సతీష్, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.