నేటి సత్యం
*
నాగర్ కర్నూలు జిల్లా .. జూలై 25 …*
*అంతర్ రాష్ట్ర వంతెన నిర్మాణానికి సహకరించాలని వినతి*
తెలంగాణ-ఆంధ్ర అంతర్ రాష్ట్ర వంతెన నిర్మాణానికి సహకరించాలని కోరుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ.. ఎంపీ మల్లు రవికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. శ్రీశైలం ఉత్తర ముఖ ద్వారమైన ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో రూప్ వే నిర్మాణానికి సహకరించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేపడితే పర్యాటకులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
రెండు రాష్ట్రాల ప్రజలకు వాణిజ్య వనరులు పెరుగుతాయి. ప్రయాణ ఖర్చు తగ్గుతుంది. రెండు రాష్ట్ర ప్రజలు భూముల విలువలు పెరుగుతాయి ఎన్నో రకాల తోడ్పాటు ప్రజలకు అనుకూలంగా ఉంటుంది