ప్రెస్ నోట్, తేదీ 25-8-2025.
* ఎం ఎల్ హెచ్ పి ల సమస్యలు పరిష్కరించాలి* .
*సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి*
— *ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు డిమాండ్*.
నేషనల్ హెల్త్ మిషన్ నందు పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ( ఎం.ఎల్.హెచ్.పి ) ల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ జిల్లా కార్యాలయం గద్వాల జిల్లాలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రంగన్న అధ్యక్షతన జరిగిన మీడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ నిబంధనల మేరకు మన రాష్ట్రంలో దాదాపు 2000 మంది మిడ్ లెవెల్ హెల్త్ వర్కర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది అన్నారు. వాస్తవానికి డబ్ల్యూహెచ్వో నిబంధన ప్రకారం కేవలం బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన వారిని మాత్రమే నియమించాలని, కానీ మన రాష్ట్రంలో ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన వైద్యులతో పాటు, ఆయుర్వేదిక్, హోమియో, యునాని డిగ్రీ చేసిన వారిని కూడా నియమించారన్నారు. వారిని నియమించటానికి ఏఐటీయూసీ వ్యతిరేకం కాదని కాకపోతే వారికి 52 వేల నుండి 40000 వరకు జీతాలు చెల్లిస్తే బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ చేసిన వారికి కేవలం 29 వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. నోటిఫికేషన్ వివరాల ప్రకారం పర్ఫామెన్స్ బేసిడ్ ఇన్సెంటివ్ ( పిబిఐ) 15వేల రూపాయలు చెల్లించాల్సి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చెల్లించడం లేదన్నారు.*సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందేనన్నారు* 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా వీళ్లకు వర్తింపజేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జిల్లాలో వీరికి పనిభారం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు వీరి సమస్యలపై త్వరలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ను కలిసి విన్నవించనున్నట్లు అలాగే జిల్లా కలెక్టర్ ను కూడా కలసి విన్నవిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు . అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. *నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నందకుమార్, బి రేణుక ఉపాధ్యక్షులుగా హైమావతి , సుజాత, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శివతేజ.సహాయ కార్యదర్శులు గా వెంకటేశ్వరీ, శ్వేతా, కోశాధికారి గా ఎం శిరీష, కార్యవర్గ సభ్యులు గా మరో 11మందిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరితో పాటుగా తదితరులు పాల్గొన్నారు*. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు వెంకటేష్, నరసింగ్ రావు 
ఐహెచ్పిఎస్ వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు.