నేటి సత్యం వికారాబాద్ జూలై 25

ఆగస్టు 13 న క్విట్ ఇండియా డే సందర్భంగా వ్యవసాయ రంగం నుండి కార్పోరేట్ సంస్థలు వైదొలగాలని, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాన్ని వ్యతిరే కిస్తూ, కేంద్ర పాలకుల రైతు వ్యతిరేక విధానాలకు ప్రతిఘటిస్తూ నిరసనగా ట్రాక్టర్, వాహనాల, ప్రదర్శనలను విజయవంతం చేయండి.
ఆహార పంటలు మొక్కజొన్న సోయా గోధుమ, పాల ఉత్పత్తి లను అమెరికా నుండి చౌకగా దిగుమతి చేసుకోనే వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవాలని, ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లను కార్పొరేటర్ సంస్థలకు దారా దత్తం చేయడానికి వీలుగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని,
పంటలకు మద్దతు ధరలు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు సీ2+50(పంటలకు అయ్యే ఖర్చుకు 50 శాతం అదనంగా) నిర్ణయించి అమలు చేయాలని, అప్పుల విష వలయంలో కూరుకుపోయిన రైతుల వ్యవసాయ కార్మికుల రుణ మాఫీ చేయాలని, విద్యుత్ ను ప్రవేటీకరించవద్ధని, స్మార్ట్ మీటర్స్ బిగించవద్ద ని గ్రామాలలో గృహాలకు 300 యూనిట్లను ఉచితంగా సరపర చేయాలని,
భూ సేకరణ 2013 చట్టం ప్రకారం చేయాలని తదితర డిమాండ్స్ పై కేంద్ర పాలకుల విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు ట్రాక్టర్ వాహన ర్యాలీల నిర్వహించాలని పశ్యపద్మ పిలుపునిచ్చారు.
వికారాబాద్ జిల్లా ఏఐటియుసి అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిట్ మాట్లాడుతూ రైతు పండిస్తున్న ఆహారాన్ని తీసుకునే ప్రతి ఒక్కరూ రైతు సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. జిల్లాలో రైతు సంఘ నిర్మాణాన్ని పటిష్టవంతం చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ప్రభలింగం మాట్లాడుతూ అమెరికాలో 36% సబ్సిడీలు పొందిన కార్పోరేట్ కంపెనీలు పండించిన పంటలను భారతదేశానికి చౌకగా దిగుమతి చేసుకునే అవకాశం కల్పిస్తూ మోడీ ట్రంప్ తో చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్ర పాలకుల విధానాలను వ్యతిరేకిస్తూ ట్రంపు మోడీ దిష్టిబొమ్మలను తగలబెట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోశాధికారి డిజి నరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని మండలాలలో రైతు సంఘం సభ్యత్వం చేర్పించాలని గ్రామ మండల కమిటీల ఏర్పాటు చేయడానికి జిల్లా నాయకత్వం కృషి చేయాలని కోరారు.
వికారాబాద్ జిల్లా రైతు సంఘం గేంటి సురేష్, వెంకటేష్ అనంతయ్య అబ్దుల్ బీరప్ప తదితరులు మాట్లాడారు.
గేంటి సురేష్.