ఆగస్టు 2న జరిగే మహాసభలను జయప్రదం చేయండి
ఈరోజు గండిపేట్ మండల్ నార్సింగి లో.RK. హోటల్లో గండిపేట్ మండల సిపిఐ కార్యవర్గ సమావేశం గండిపేట్ మండల సిపిఐ కార్యదర్శి ఎస్ మల్లేష్ అధ్యక్షతన జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు రంగారెడ్డి జిల్లా సిపిఐ మాజీ సెక్రెటరీ కామ్రేడ్ పుస్తకాల నర్సింగరావు గారు పాల్గొనడం జరిగింది
నర్సింగరావు గారు మాట్లాడుతూ ఆగస్టు రెండున మొయినాబాద్ మండల్ లో జరగబోయే రంగారెడ్డి జిల్లా సిపిఐ మహాసభలు విజయవంతం చేయాలని అన్నారు అదేవిధంగా నిరుపేదల అందరికీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందాలని 60 గజాల స్థలాలలో ఇండ్లు నిర్మిస్తున్న ప్రతి ఒక్కరికి సకాలంలో బిల్లులు చెల్లించాలనిరేషన్ కార్డులు లేనివారికి రేషన్ కార్డులు ఇవ్వాలని మూడు నాలుగు రోజుల నుంచి విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది హనీ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించాలని నాలాలను కబ్జా చేసిన వి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరాడు
ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు ఎం శంకరయ్య బాబురావు స్వామి శ్రీకాంత్ నజీర్ పాల్గొనడం జరిగింది