నేటి సత్యం షాద్నగర్. జులై 26 
ఉదయం షాద్నగర్ చౌరస్తా లో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదకరం బుద్దుల జంగయ్య
షాద్నగర్ చౌరస్తాలో ఉదయం కాలేజీ కోసం బస్సు ఎక్కించడానికి తండ్రి కూతుర్ని తీసుకొని వస్తున్న సందర్భంలో సిగ్నల్ దాటుతుండగా ప్రమాదం జరిగి తండ్రీ కూతురు చనిపోవడం విషాదకరమని
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు
బుద్ధుల జంగయ్య విచారం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌరస్తాలో సిగ్నల్ దాటుతుండగా ఇంతకుముందు కూడా అనేక ప్రమాదాలు జరిగాయని ఆయన తెలిపారు సిగ్నల్ పడినా కూడా వాహనదారులు అట్లాగే దాటుతున్నారని అలాంటి సందర్భంలో హడావిడిలొ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే సిగ్నల్ దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు ఉండాలని ఎవరు సిగ్నల్ అతిక్రమించిన వారి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉందని అలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తే తప్ప సిగ్నల్ దగ్గర ఇలాంటివి అరికట్టడం సాధ్యం కాదని ఆయన సూచించారు ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఇలాంటివి అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు చనిపోయిన తండ్రి కూతుళ్ళకు కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు