(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం కొండాపూర్ జిల్లా 26


*బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సంఘీభావం తెలిపిన శేరిలింగంపల్లి నాయకులు*
-
*బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి శేరిలింగంపల్లి బిఆర్ఎస్ నాయకులు సంఘీభావంతెలిపారు.ఈరోజు అనగా 26/07/2025 న శనివారం కొండాపూర్ లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ శ్రీ కొమిరిశెట్టి సాయిబాబా నాయకత్వంలోని బిఆర్ఎస్ నాయకులు ఆయన నివాసానికి చేనుకున్నారు. అనంతరం ఆయనకు తాము సంఘీభావం తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై అక్రమ కేసులు బనాయించడం అన్యాయం అన్నారు. అనవసరంగా ఉద్రిక్త వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయరాదని ఆయన సూచించారు. రాజకీయంగా చేసే విమర్శలకు పత్రికాముఖంగా ఖండించాలి తమ వైఖరిని చెప్పాలని కానీ ఇలా ఉద్రిక్తతలు సృష్టించేలా దాడులు చేసేలా ప్రేరేపించడం అన్యాయమన్నారు.బిఆర్ఎస్ పార్టీ నాయకులామంతా సమిష్టిగా పోరాటం చేస్తూ పార్టీకి పూర్వం వైభవం తీసుకొస్తామన్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.*