(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*ఎస్సీ ఎస్టీ కేసులలో పెండింగ్ లో ఉన్న ఛార్జి షీట్లు పూర్తి చేయాలి, బాధితులకు నష్టపరిహారం అందజేయాలి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్*
నేటి సత్యం.పల్నాడు. నరసరావుపేట. జూలై 26
పల్నాడు జిల్లాలో దళిత గిరిజనుల పైన జరుగుతున్న దాడులు హత్యలు ఆత్యాచారాలను అరికట్టటానికి నిరంతరం పోరాటం చేస్తున్న నేపథ్యంలో గ్రామాలలో తారసపడుతున్న ప్రధాన సమస్యలపై నేడు జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ సెల్ నందు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ ఆధ్వర్యంలో మెమొరాండం ఇవ్వటం జరిగింది
పల్నాడు జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసులలో నేటికీ ఎన్నో కేసులలో చార్జిషీట్లు వేయక కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆ యొక్క కేసులకు సంబంధించిన బాధితులకు సంవత్సరాల తరబడి నష్టపరిహారం అందటం లేదని తక్షణమే అందేలా చూడాలని అలాగే జిల్లాలో ఎన్నో గ్రామాలలో ఒక మనిషి చనిపోతే పాతి పెట్టడానికి ఆరడుగుల స్థలము లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలకు స్మశాన భూములు కేటాయించాలని, ప్రధానంగా సంవత్సరాలుగా ప్రభుత్వానికి సంబంధించిన భూములలో పంటలు వేసుకొని సాగు చేసుకుంటున్నా ఎస్సీ ఎస్టీల వద్ద నుండి బలవంతంగా అధికార ఆర్థిక అహంకార బలంతో ఆక్రమించుకున్న వ్యక్తుల చేతులలో నుండి ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోవాలని వేల ఎకరాలు జిల్లాలో ఉన్న భూ బకాసురుల వద్ద నుండి ప్రభుత్వం తీసుకొని సెంటు భూమి లేని ఎస్సీ ఎస్టీలకు ప0చేలా ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ తెలిపారు అర్జీ ఇచ్చిన వారిలో దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్, గిరిజన సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట నాయక్, బొంత కృష్ణ, కుందుర్తి చెన్నకేశవులు,కుక్కమూడి మరియదాసు, తదితరులు అర్జీ ఇచ్చిన వారిలో ఉన్నారు …