Neti Satyam
Newspaper Banner
Date of Publish : 26 July 2025, 12:43 pm Editor : Admin

ప్రజా సమస్యల పరిష్కారానికి రాజిలేని పోరాటాలకు సిద్ధం కండి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం కొల్లాపూర్ జూలై 26

*పీడిత తాడిత ప్రజల సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటాలకు సిద్ధం కండి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ఎండి ఫయాజ్*

పేద ప్రజల అభ్యున్నతి కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ఎండి ఫయాజ్ పిలుపునిచ్చారు నేనిక్కడ కొల్లాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కొల్లాపూర్ మండల సిపిఐ సమితి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల చరిత్రలో నిత్యం ప్రజలకై ప్రజల మధ్యలో ఉంటూ నోరులేని ప్రజల హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నారు నేడు దేశంలో సంపదంత సంపన్నుల చెంతకే చేరుతూ డబ్బున్న వాడు మరింత ఉన్నవాడుగా ఎదుగుతూ లేనివాడు రోజురోజుకు మరింత పేదవాడిగా పేదరికంలో మగ్గుతున్నటువంటి ఈ దశలో సమాజంలో మనుషులంతా సమానంగా ఉండాలని అందుకోసమే ప్రతి ఉద్యమంలో సిపిఐ ఎర్రజెండా పాల్గొంటుందని వారు తెలిపారు కొల్లాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో సిపిఐ నాగర్కర్నూల్ జిల్లా మూడవ మహాసభలు కల్వకుర్తి పట్టణంలో జరుగుతున్నాయి ఆ సందర్భంగా ఒకటవ తేదీన జరిగే బహిరంగ సభకు ఈ ప్రాంతం నుండి ప్రజలు పెద్ద ఎత్తున వేలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు అంతరాలు లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయోభిలాషులు శ్రమించి పనిచేయాలని ఫయాజ్ పిలుపునిచ్చారు ఈ సమావేశానికి ఎండి యూసుఫ్ అధ్యక్షత వహించగా సిపిఐ కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు గారు కార్యక్రమాల సమీక్షించి భవిష్యతి కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు గుర్రపు కురుమయ్య కోడేరు మండల పార్టీ కార్యదర్శి తప్పేట కిరణ్ కుమార్ మండల నాయకులు జంగం శివుడు సింగోటం శాఖ నూతన కార్యదర్శి ఎల్లపోగా చందు పిజ్జా శివ శంకర్ ఎండి ఖాజా మైనుద్దీన్ జూగుట శంకర్ మాసినపల్లి మాసనపల్లి అలివేలమ్మ గనియారి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు