(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పంచాయతీ సెకరేట్రి పై ఏసీబీ కేసు
– పరారీలో నిందితుడు
నేటి సత్యం 
, కొత్తూరు
రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం, ఇన్ములనర్వ గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేందర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఓ నిర్మాణంపై ఇచ్చిన నోటీసును పక్కన పెట్టేందుకు ఫిర్యాదుదారుడి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేసి, అందులో యాభై వేల రూపాయలు లంచం తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నం చెయ్యగా నిందితుడు పరరాయ్యడు.తన విధిని సక్రమంగా, నిజాయితీగా నిర్వర్తించాల్సిన ప్రభుత్వ ఉద్యోగి, లంచానికి పాల్పడినట్లు ఏసీబీ తెలిపింది.శుక్రవారం సాయంత్రం శంషాబాద్‌లోని ఇండియానా హోటల్ సమీపంలో ఫిర్యాదుదారుడి నుండి లంచం మొత్తాన్ని సురేందర్ స్వీకరించి తన TG 07 C 2555 నంబర్ గల మహీంద్రా ఎస్‌యూవీ కారులో సంఘటనా స్థలం నుండి చందానగర్ లోని తన అపార్ట్మెంట్ వెళ్ళాడు. తన కారు తన ఇంటి దగ్గర పార్క్ చేసి తన బామ్మర్ది కార్ తీసుకొని అతనికి కి లంచం డబ్బులు ఇచ్చి అక్కడి నుండి పరారయ్యడు. అయితే, ఏసీబీ అధికారులు కారును, లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు సురేందర్ కోసం గాలింపు చర్యలు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.కానీ శుక్రవారం సాయంత్రం ఏసీబీ రైడ్ జరిగితే శనివారం సాయంత్రం ఏసీబీ ప్రెస్ నోట్ రిలీజ్ చెయ్యడం ఆ నోట్ సోషల్ మీడియా లో హల్చల్ కావడం గమనార్హం.
*లంచం అడిగితే సంప్రదించండి*
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే, ప్రజలు తక్షణమే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్ లో (@తెలంగాణ ఏసీబీ ) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ఏసీబీ తెలంగాణను సంప్రదించవచ్చని..సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ప్రెస్ నోట్ లో ఏసీబీ స్పష్టం చేసింది.