Neti Satyam
Newspaper Banner
Date of Publish : 26 July 2025, 5:03 pm Editor : Admin

గద్వాల జిల్లా మహాసభలను జయప్రదం చేయండి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

గద్వాల జులై 26

*మత రాజకీయాలతో దేశాభివృద్ధికి విఘాతం-సీపీఐ*

*కార్పొరేట్ సంపన్నులకు రాయితీలు ఇచ్చి సంపదను సృష్టించే శ్రమజీవులకు పన్నుల భారం మోపుతున్నారు*

*జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలి.*

*సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి*
*–గద్వాల మండల 3వ మహాసభలో*
*సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు పిలుపు*

మత రాజకీయాలతో దేశ ప్రయోజనాలు దెబ్బతిని తీవ్ర విఘాతం ఏర్పడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు పేర్కొన్నారు. దేశంలో బడా కార్పొరేట్ సంపన్నులకు వ్యాపార దిగ్గజాలకు రాయితీలు, బ్యాంకు రుణాల మాఫీలు చేస్తున్న మోడీ ప్రభుత్వం దేశ సంపద సృష్టికర్తలైన శ్రమజీవులకు మాత్రం తరతరాలుగా శ్రమ దోపిడికి గురి చేస్తూ మోయలేని భారాలు మోపడం సిగ్గుచేటని సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు ఆరోపించారు. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఖాసిం అధ్యక్షతన జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ గద్వాల మండల మూడో మహాసభకు ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు :-దేశంలో సగటు జాతీయ ఆదాయంలో 80 శాతం ఆదానీ అంబానీ లాంటి కుబేరుల చేతుల్లో సంపద కేంద్రకృతం అవుతుందని అన్నారు. దీని ఫలితంగా వ్యవస్థలో ప్రజల మధ్య తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని అన్నారు. దేశంలో మత రాజకీయాలు కేవలం బీజేపీ స్వార్థం కోసమే తప్ప దేశ అబివృద్దికి కాదన్నారు ప్రజల మనుగడకు ఉపయోగపడనీ మతరాజకీయాలు సంక్షోభాలకు దారి తిస్తాయని అభివర్ణించారు. వెనుకబాటుకు నెలవైన నడిగడ్డ జిల్లా పెండిగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కొత్తగా ఏర్పడిన జిల్లాకు సరైన వనరులు లేవని అనేక మండలాలు మున్సిపాలిటీలు ఏర్పాటు అయినప్పటికీ సొంత భవనాలు, సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కనుక రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి అభివృద్ధికి బాటలు వేయాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ ఏర్పడి వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా త్యాగాలు పోరాటాలు ప్రతి ఒక్కరూ నెమరువేసుకొని ప్రజలకు వివరించి చెప్పాలని కోరారు. ఆగష్టు 7, 8వ తేదీల్లో జరిగే గద్వాల జిల్లా సిపిఐ 3వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపుిచ్చారు.
అనంతరం మండల సీపీఐ నూతన కమిటీనీ ఏకగ్రీవంగ ఎన్నుకున్నారు మండల కార్యదర్శి గా ఖాసిం, సహాయ కార్యదర్శులుగా వెంకటేస్,వేంకట్రాముడు, ఖాదర్ పాషా,వెంకటేష్, కార్యవర్గ సభ్యులు గా 7మందిని కౌన్సిల్ సభ్యులుగా 15మందిని ఎన్నుకన్నట్లు మండల కార్యదర్శి ఖాసిం తెలిపారు *ఈ కార్యక్రమంలో ,AITUC జిల్లా కార్యదర్శి జి రంగన్న వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు ఆశన్న,సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఖాసిం aiyf నాయకులు వెంకటేష్, సీపీఐ నాయకులు వెంకట్రముడు, ఖాదర్, కృష్ణ, పరమేష్ శేషన్న,ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు వెంకటేష్, మస్తాన్, దర్మ్మన్న, వెంకత్రముడు, ప్రభుదాస్, తిమ్మప్ప,సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.*