నేటి సత్యం నాగర్ కర్నూల్
*BSF ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు.*
*-జిల్లా విద్యాశాఖ, నోడల్ అధికారులతో పోస్టర్లు విడుదల.*
బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ (BSF) ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పాఠశాల, కళాశాల, హాస్టల్లలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు BSF రాష్ట్ర కార్యదర్శి కొంగరి రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్, జిల్లా నోడల్ అధికారి వెంకటరమణ లతో అవగాహన సదస్సుల యొక్క పోస్టర్లను విడుదల చేయించారు. అనంతరం కొంగరి రామకృష్ణ మాట్లాడుతూ.. ఆగస్టు 01 నుండి అక్టోబర్ 01వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. చాలామంది విద్యార్థులు మత్తుకు బానిస అయ్యి చెడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సాయిబాబు, నాగర్ కర్నూల్ డివిజన్ అధ్యక్షులు రాంచందర్, జిల్లా నాయకులు సురేష్, సమద్ పాషా, భరత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
