(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శేర్లింగంపల్లి జూలై 27 

*ఆగస్టు 2 సిపిఐ రంగారెడ్డి జిల్లా 17వ మహాసభను విజయవంతం చేయండి సిపిఐ రామకృష్ణ*
నేటి సత్యం. శేరిలింగంపల్లి. జులై 27
ఈరోజు ఉదయం 11 గంటలకు. సిపిఐ శేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యాలయంలో. కే చందు యాదవ్ అధ్యక్షతన.. కార్యవర్గ సమావేశం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ…
భారతదేశంలోనే. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ. స్వాతంత్ర ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమంలో. ముందుండి పోరాడిన ఏకైక పార్టీ.!
వేల ఎకరాలు భూములు పంచిన చరిత్ర సిపిఐ పార్టీకి దక్కింది.!.
హైదరాబాదు మహానగరంలో. పొట్ట జీవనం కోసం వలస కార్మికులను కూడగట్టి. వారి బాగు కోసం. ఇంటి స్థలాల పోరాటం చేసి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో 20 బస్తీలను నెలకొల్పిన చరిత్ర ఎర్ర జెండా సిపిఐ పార్టీకే దక్కింది.! శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నో ఆటో స్టాండ్లను నిర్మించిన ఘనత. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి నాటికి నేటికి ప్రజా.ఉద్యమాలు చేసి రేషన్ కార్డులు వితంతు పింఛన్లు. డ్వాక్రా గ్రూపు మహిళలకు లోన్లు. ఒంటరి మహిళ పింఛను. సీనియర్ సిటిజన్. పించను. చదువుకొని ఉద్యోగం లేని నిరుద్యోగులకు ఉద్యోగ భృతికై. ఇలా అనేక పోరాటాలు చేసే ఏకైక పార్టీ సిపిఐ.!
రంగారెడ్డి జిల్లా మహాసభలు. ఆగస్టు రెండున మొయినాబాద్ లో జరుగుతున్నాయి. ఈ మహాసభలలో భూ పోరాటాలు చేయుటకు తీర్మానాలు చేయబోతున్నరు..
మహాసభలు అయిపోయిన వెంటనే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలను కూడగట్టి భూ పోరాటాలకు శ్రీకారం చుడతామని రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో. కే వెంకట స్వామి. తుపాకుల రాములు కే సుధాకర్ సురేష్ ముదిరాజ్ కే కాసిం. బి నారాయణ. చంద్రమ్మ ఎస్ కొండలయ్య పరమేష్ తదితరులు పాల్గొన్నారు