Neti Satyam
Newspaper Banner
Date of Publish : 27 July 2025, 9:26 am Editor : Admin

విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నాగర్కర్నూల్ జులై

27

♦️ఉయ్యాలవాడ జ్యోతి భాపులే విద్యార్థినులను పరామర్శించిన నాగర్ కర్నూల్ ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు.

♦️నిన్న రాత్రి ఆహారం వికటించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సౌకర్యాల గురించి ఆరా తీసిన ఎమ్మేల్యే గారు.

♦️జిల్లా వైద్యాధికారి మరియు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్యులను అడిగి విషయాలను తెలుసుకోవడం జరిగింది.

♦️దీనికి గల కారణాన్ని సంభధిత పాఠశాల ప్రిన్సిపాల్ మరియు గురుకులాల రీజినల్ కో ఆర్డినేటర్ మరియు జిల్లా విద్యాధికారిని అడిగి దానికి గల కారణాల గురించి సమీక్షించడం జరిగింది.

♦️చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి తల్లితండ్రులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని వారికి చెప్పడం జరిగింది.

♦️భవిష్యత్తులో ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తానని దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఎమ్మేల్యే గారు చెప్పడం జరిగింది.

♦️ఇప్పటి నుంచి తానే స్వయంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల బాధ్యత తీసుకుంటానని ప్రతి నెలకు ఒకసారైనా తానే స్వయంగా పర్యటించి తనిఖీలు నిర్వహిస్తానని చెప్పడం జరిగింది.

♦️పాఠశాలలకు కిరాణా సరుకులు, కాయకూరలు, పాలు సరఫరా చేసే ఏజెన్సీ లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది.

♦️ఈ ఘటనకు సంబంధించి పూర్తి రిపోర్ట్ ను ఈరోజు సాయంత్రంలోగా సమర్పించాలని సంబంధిత అధికారులకు హెచ్చరించడం జరిగింది. రిపోర్ట్ వచ్చిన వెంటనే దానిని బట్టి దీనికి కారణమైన వారిని ప్రభుత్వ పరంగా కఠినంగా శిక్షించడం జరుగుతుంది అని ఎమ్మేల్యే గారు చెప్పడం జరిగింది.

♦️గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వం గురుకులాల్లో చదివే విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, దానికి నిదర్శనం ఇటీవలే మెస్ ఛార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచడమే అన్నారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీని తీసుకురావడానికి కృషి చేస్తానని దీనిని అనవసరంగా ఎవరు కూడా రాజకీయం చేయవద్దని ఆయన ఈ సందర్భంగా అనడం జరిగింది.

ఎమ్మేల్యే గారి వెంట జిల్లా అధికారులు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.