Neti Satyam
Newspaper Banner
Date of Publish : 27 July 2025, 10:18 am Editor : Admin

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా? సిపిఐ! ఏఐఎస్ఎఫ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నాగర్కర్నూల్ జులై 27

*విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం*

*విద్యార్థులు ఫుట్ పాయిజన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళని పరామర్శించిన సిపిఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు*

*నాణ్యతలేని సరుకుల వల్లనే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది*

నేటి సత్యం.నగర్ కర్నూల్. జులై 27

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆనంద్ జి ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి బలుమల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నటువంటి మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం వల్ల అస్వస్థకు గురయ్యారు, ఆరోగ్యం విశ్వమించటంతో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి 70 మందిని విద్యార్థులను తరలించడం జరిగింది, ఉదయము 35 మందిని తరలించడం ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది, మొత్తము 105 పైచిలుకు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని తెలిసింది, ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం నాణ్యత లేని సరుకులు పాఠశాలలకు పంపించడం వల్లనే అని తెలుస్తుంది కండ్ల కట్టినట్టు, ఆ ఒక్క పాఠశాలలో సంబంధించిన అధికారులు ప్రిన్సిపాల్ గా ఉన్న లలిత, వార్డెన్ జ్యోతి వీళ్లతోపాటు అక్కడున్న సిబ్బంది విద్యార్థులకు ఆరోగ్యం పట్ల పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు, గతంలో నాగర్ కర్నూలు జిల్లాలో మున్నూరు మండలం కేంద్రంలో గురుకుల విద్యార్థులు 40 మందికి ఇదే తరహాలో ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వము ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడున్న సిబ్బందిని కాపాడుకుంటూ వస్తుంది, విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు, నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల ప్రాంతం ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుకునే వసతి లేక గురుకుల పాఠశాలలో కస్తూర్బా మహాత్మ జ్యోతిరావు పూలే ఇలాంటి వంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు కాబట్టి అలాంటి నిరుపేద విద్యార్థులను తమ మదిలో పెట్టుకొని నడుచుకోవాలని కోరారు, ఉయ్యాలవాడ జ్యోతిరావు పూలే జరిగిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఎక్కడ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు, విద్యార్థుల ఆరోగ్యాలు కుదుటపడేంతవరకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ యొక్క కార్యక్రమంలో సిపిఐ నాగర్ కర్నూల్ నాయకులు రామస్వామి, ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అభిలాష్, విగ్నేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు