
నేటి సత్యం శేర్లింగంపల్లి
*ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఓపెనింగ్ పిఎసి చైర్మన్ ఆర్కపొడి గాంధీ*
నేటి సత్యం.శేర్లింగంపల్లి. జులై 27
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో హోప్ ఆఫ్ హాంగర్ సంస్థ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హాఫ్ ఆఫ్ హాంగర్ ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను గౌరవ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ పి ఎ సి చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.
ఈ సందర్భంగా పి ఎ సి చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ పేద ,మధ్య తరగతి ప్రజల పిల్లలకు ఉచితంగా మంచి నాణ్యమైన ఇంగ్లీష్ విద్య ను అందించడానికి హాఫ్ ఆఫ్ హాంగర్ ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు కు కృషి చేసిన హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఆలేఖ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని పిఎసి చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.చుట్టూ పక్క పరిసర ప్రాంత విద్యార్థులు ఈ చక్కటి సదాఅవకాశం ను సద్వినియోగం చేసుకోవాలని , పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మాద్యం లో బోధన కలదు అని ,హోప్ ఆ హాంగర్ సంస్థ వారు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను అని పిఎసి చైర్మన్ గాంధీ గారు అన్నారు.
పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపడానికి నా వంతు సహాయ సహకారాలను ఎల్లవేళలో ఉంటాయి అని పిఎసి చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. పై చదువలకు ఆటంకం కల్గకుండా , మంచి గా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాందించుకోవాలి అని , ఉన్నత శిఖరాలు అందుకోవాలని, మంచి భవిష్యత్తు ను ఏర్పరచుకొని ఉన్నత లో స్థిరపడలని,ఎప్పుడు ఏ సహాయం కావల్సిన తన వంతు కృషి చేస్తానని విద్యార్థులకు తెలియచేస్తున్నాను అని పీఏసీ చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.