Neti Satyam
Newspaper Banner
Date of Publish : 27 July 2025, 11:40 am Editor : Admin

మా ఫుడ్ బాగాలేదు సార్ చిన్నారుల ఆవేదన!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మెనూ ప్రకారం తిండి పెట్టరు…
పెట్టిన సాంబారు లో పురుగులు…

కొల్లాపూర్, జూలై 27(నేటి సత్యం ప్రతినిధి :యస్. పి. మల్లికార్జున సాగర్)

తెలంగాణ రాష్ట్రం లోని గురుకుల పాఠశాలల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్త మైందని విద్యార్థుల జీవితాలతో నిర్వాహకులు ప్రభుత్వం లు పూర్తి నిర్లక్ష్యాలు వహిస్తున్నాయని భారత రాష్ట్ర సమితి నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన ఆందోళనలను వెలిబుచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామం లో ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిరావు పూలే వెనక బడిన తరగతుల సాంఘిక సంక్షేమ హాస్టల్ లోని విద్యార్థులు కలుషిత ఆహారం ను శనివారం తిని అస్వస్థతకు గురైనట్టు తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం ఉదయం ఉయ్యాలవాడ లోని వెనకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్ ను సందర్శించి అస్వస్థకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితు లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భం గా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో గురుకుల పాఠశాలల నిర్వహణ పూర్తిగా అద్వానమై పోయాయని అధికారులు, హాస్టల్ నిర్వాహకుల, ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యాల మూలము గా హాస్టల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతులు కల్పించబడటం లేదని కలుషిత ఆహారాలు తిని విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని హరీష్ రావు విమర్శించారు.
ఉయ్యాలవాడ లోని వెనుకబడిన తరగతుల గురుకుల హాస్టల్ ను తాను సందర్శించి నప్పుడు కొల్లాపూర్ నివాసి రూప తన కూతురు గురుకుల హాస్టల్ లో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నది అని శనివారం కలుషిత ఆహారం తిని వాంతులు , బేదులు చేసుకుంటున్నదని తెలిసి ఆదివారం ఉదయం తన కూతుర్ని హాస్టల్ నుంచి ఇంటికి వెళ్దామని వచ్చానని ఆదివారం ఉదయం హాస్టల్లో అల్పాహారం గా పెట్టిన అన్నం సాంబారులో పురుగులు వచ్చాయని అలాంటి దుర్వాసన వస్తున్న తిండిని తినలేక తన కూతురు అట్టి ఆహారం ను నేల పై పారబోసిందని రూప కన్నీరు కారుస్తూ చెప్పిందని హరీష్ రావు అన్నారు.
శనివారం కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఘటన అలా ఉంచితే ఆదివారం ఉదయం అయినా అధికారులు అప్రమత్తతై విద్యార్థులకు నాణ్యమైన బోజనాలు పెట్టాల్సిన పరిస్థితిని చేపట్టకుండా ఆదివారం ఉదయం మెనూ ప్రకారం చపాతి పూరీలు పెట్టాల్సి ఉండగా విద్యార్థులకు అన్నం సాంబార్ ను పెట్టడం దారుణమని అలాంటి సాంబార్లో కూడా పురుగులు రావడం అట్టి ఆహారాన్ని విద్యార్థులు తినక పోవడం చూస్తుంటే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అధికారులు ప్రభుత్వం ఏ మాత్రం శు చి శుభ్రత ఉన్న తిండిని పెడుతున్నారో ఇట్టే అర్థం అవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గురుకుల పాఠశాలలో విద్యాబోధన మంచిగా ఉందని, కానీ గురుకుల పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తం గా ఉన్నదని పాఠశాల ఆవరణ అంతా కంపు కొడుతుందని బాత్రూంలకు వెళితే వాంతులు చేసుకోవాల్సిన దుర్గతి ఉందని, కలుషిత ఆహారము ను, నాణ్యతలేని ఆహారము ను తమకు పెడుతున్నారని విద్యార్థులు తమకు చెబుతూ వాపోయారని హరీష్ రావు విలేకరులకు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రం లో వివిధ ప్రాంతాల లోనీ ప్రభుత్వ గురుకుల హాస్టల్ లో కలుషిత ఆహారాలు తిని విద్యార్థులు అస్వాస్థత లకు గురైన సంఘటనలు వరుసగా జరుగుతున్నాయని దీనిని అధికారులు ప్రభుత్వం గురుకుల పాఠశాలల నిర్వహకులు గుర్తించి విద్యార్థుల ఆరోగ్యాల పట్ల తగిన శ్రద్ధ వహిస్తూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన రుచికరమైన బోజనాలు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఉయ్యాలవాడ లోని గురుకుల హాస్టల్ ను సందర్శించి, అస్వస్థకు గురైన విద్యార్థులను హరీష్ రావు తో పాటు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి , నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి , అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల రాజు తదితరులు పాల్గొనీ అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించారు.