Neti Satyam
Newspaper Banner
Date of Publish : 27 July 2025, 2:12 pm Editor : Admin

అమ్మను మించిన దైవమున్నదా




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శంషాబాద్. జులై 27

🔷🔷 తల్లికి నివాళిగా నిరుపేదలకు అన్నదానం 🔷🔷

✦ నీలమ్మ 9వ వర్ధంతి సందర్భంగా 2,000 మందికి భోజనం
✦ అన్నెపు ప్రభు సేవలను పొగిడిన సీపీఐ నేత పర్వతాలు

తల్లి నీలమ్మ 9వ వర్ధంతి సందర్భంగా కుమారుడు అన్నెపు ప్రభు సోమవారం రోజు 2,000 మంది పేదలకు అన్నదానాన్ని నిర్వహించి నన్యమైన ఉదాహరణగా నిలిచారు. షాద్‌నగర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నేత పానుగంటి పర్వతాలు ముఖ్య అతిథిగా పాల్గొని, అన్నదానానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ — “వృద్ధాశ్రమాలు నిండిపోతున్న ఈ కాలంలో, తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ సేవచేసే కొడుకు అరుదు. అన్యపు ప్రభు ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తుండటం ప్రశంసనీయం” అని తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న అన్నెపు ప్రభు, కార్మికుల సంక్షేమంతో పాటు సామాజిక సేవలోనూ అంకితభావం కనబరుస్తున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్. యాదగిరి, మండల కార్యదర్శులు నర్రగిరి నందిగామ, గడ్డం జంగయ్య, ఎస్. మల్లేష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కార్మికులు పాల్గొన్నారు.

సేవకార్యకర్తలుగా పాల్గొన్న వారు: ఎల్. అరుణ్, శ్రీనివాస్ చారి, నీరటి శ్రీనివాస్ ముదిరాజ్, దేవులపల్లి ఉదయ్ రాజ్, కావాలి మల్లేష్, శ్రీను నాయక్, పతేంగే ప్రశాంత్, సతీష్. కే శైలేందర్. జై మల్లేష్ తదితరులు.