(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్
*రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న సరోగసీ, సంతానోత్పత్తి (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి*
*సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి*
*రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సంతానోత్పత్తి కేంద్రాలను తనిఖీలు నిర్వహించాలి*
*ఏఐవైఎఫ్ బృందం వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ కు వినతి*
*ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్*
నేటి సత్యం.హైదరాబాద్. జూలై 20 ఎనిమిది
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న సరోగసీ, సంతానోత్పత్తి (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని, సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సంతానోత్పత్తి కేంద్రాలను తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కోఠి లోని రాష్ట్ర ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ ఆర్. పుష్ప కు ఏఐవైఎఫ్ బృందం వినతిపత్రం అందజేశారు.
ఈ వినతి కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. సత్య ప్రసాద్, శ్రీమాన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. బాలకృష్ణ, శివకుమార్, రాష్ట్ర సమితి సభ్యులు షేక్ మహమూద్, కళ్యాణ్,రాజేందర్, మధుకర్, విష్ణు పాల్గొన్నారు.