Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 July 2025, 1:56 pm Editor : Admin

క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్. జూలై 28

గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ గారు..

గత వరం ఉప్పల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్పొరేటర్స్ స్పోర్ట్స్ మీట్ లో షటిల్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి విజయం సాధించడం ఆనందంగా ఉందని,ఈరోజు గౌరవనీయ హైదరాబాదు మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు,తోటి కార్పొరేటర్స్,స్టాండింగ్ కమిటీ సభ్యులు మరియు కమిషనర్ శ్రీ కర్నన్ గారి చేతుల మీదుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్స్ కప్ స్వీకరించడం నా జీవితంలో గర్వకారణమైన,మరిచిపోలేని ఘట్టం అని అన్నారు గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యులు మాదాపూర్ కార్పొరేటర్ వి జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈ అవకాశం ఇచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వాహకులకు,నా తోటి ఆటగాళ్లకు,కార్పొరేటర్లకు మరియు నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు..