Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 July 2025, 2:05 pm Editor : Admin

నాగర్ కర్నూల్ జిల్లా మూడవ మహాసభను జయప్రదం చేయండి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా 3వ మహాసభ వాల్ పోస్టర్ విడుదల

నేటి సత్యం తెలకపల్లి మండల్. జూలై 28

ఈరోజు తెలకపల్లి మండల కేంద్రంలోని సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ వాల్ పోస్టర్లు విడుదల సిపిఐ నాగర్ కర్నూల్ 3 వ మహాసభలో ఈనెల 1, 2 వ తేదిలలో కల్వకుర్తి పట్టణం లో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ తెల్కపల్లి మండల కార్యదర్శి కామ్రేడ్ వేనేపల్లి రవీందర్ గారు పిలుపునివ్వడం జరిగింది.
వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. దేశంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై పాలకులను ఎప్పటికప్పుడు ఎండ కట్టడం జరుగుతుంది అని వారు కొనియాడారు.
ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా

కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు

కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు సిపిఐ జాతీయ నాయకులు మాజీ శాసనసభ్యులు

గోరేటి వెంకన్న ఎమ్మెల్సీ గారు

కామ్రేడ్ ఎం బాల నరసింహ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

పాల్గొనడం జరుగుతుంది
ఒకటవ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు ఆర్టీసీ బస్టాండు నుంచి కల్వకుర్తి పట్టణ ంలో హెచ్ వై డి చౌరస్తా వరకు ఎర్రజెండాలతో డప్పులతో కళాకారులతో భారీ ప్రదర్శన ఉంటుంది కావున పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు అభిమానులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య శంకర్ గౌడ్ ఏఐవైఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దేశమోని ఆంజనేయులు మండల సిపిఐ నాయకులు కురుమయ్య మల్లేష్ శివ రామకృష్ణ బద్రి తదితరులు పాల్గొనడం జరిగింది