Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 July 2025, 2:11 pm Editor : Admin

శిశుపాలుడి తప్పుల కౌశిక్ రెడ్డి తప్పులు 100 పూర్తి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం షాద్నగర్ జులై 28

*ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వీధి రౌడీ..!*

*శిశుపాలుడి తప్పుల్లా కౌశిక్ రెడ్డి తప్పులు 100 పూర్తి*

*మూడు నెలల్లో చూసుకో నీ సంగతి ఏం జరుగుతుందో..?*

*నిచమైన భాష, ఇంత దిగజారుడుతనం అవసరమా..?*

*అధికార తాపత్రయం కోసం రాజకీయాలను భ్రష్టు పట్టించారు*

*కుక్కలకు ఉన్న విశ్వాసం మీకు లేకుండా పోయింది*

*నీలా దిగజారి విమర్శించాలంటే ఎంతకైనా తెగిస్తాం..*

*”షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్” అల్టిమేటం*

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వీధి రౌడీల ప్రవర్తిస్తున్నాడు.. పార్టీ మెప్పుకోసం నీచమైన భాషను వాడుతూ పూర్తిగా దిగజారిపోయాడు.. నీవు మాట్లాడినట్టుగా నీ కన్నా ఎక్కువగా మా కార్యకర్తలు మాట్లాడగలరు.. కానీ మాకు సంస్కారం అడ్డు వస్తుంది.. శిశుపాలుడి తప్పుల్లా నీ తప్పులు కూడా 100 పూర్తయ్యాయి.. మూడు నెలలు ఆగు నీ సంగతి ఏంటో చూస్తాం..! అంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. సోమవారం షాద్ నగర్ ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై ధ్వజమెత్తారు. తెలంగాణలో రాజకీయ విలువలను పూర్తిగా దిగజార్చుతూ దురహంకారాన్ని ప్రదర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పై దుష్ప్రచారం చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. లేనిది ఉన్నట్టుగా దుష్ప్రచారానికి పాల్పడుతూ వికృత చేష్టలు చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ విధానాలు రాజ్యాంగానికే విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. రోజురోజుకు బిఆర్ఎస్ నాయకులు విలువలు దిగజార్చుతున్నారని బజారులో కుక్కల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారని వాటికైనా కనీసం విశ్వాసం ఉంటుందని ఎమ్మెల్యే విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ వెప్పు కోసం దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి తన రాజకీయ వైఖరి మార్చుకోకపోతే గుణపాఠం చెబుతామని అన్నారు. రాజకీయాల్లో భార్యా పిల్లలను అడ్డంగా పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి పై చట్ట ప్రకారమే చర్యలకు ఉపక్రమిస్తామని తమ కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఏమవుతుందో ప్రజలకు తెలుసని కానీ తాము సమయమనం పాటిస్తున్నామని అన్నారు. తెలంగాణ త్యాగాల గడ్డ అని ఇక్కడ పోరాటాలు పౌరుషాలు కొత్తేం కాదని తాము పౌరుషం చూపిస్తే ఏం జరుగుతుందో పాడి కౌశిక్ రెడ్డి గ్రహించాలన్నారు. ఓ వీధి రౌడీలా కౌశిక్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని శాసనసభ ద్వారా శాసన చట్టాల ద్వారా రాజ్యాంగంపై ప్రమాణం చేసి నేడు ఒక ఎమ్మెల్యే మాట్లాడని మాటలను మాట్లాడుతున్నాడని దీనిని ప్రజలు గమనించాలని సూచించారు. ఒక ఎమ్మెల్యేగా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి విజ్ఞతకే కాంగ్రెస్ పార్టీ వదిలిపెడుతుందని పేర్కొన్నారు.

*అధికారం చేజారిందని కడుపుమంట..*

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటిందని ఈ మాత్రానికే బిఆర్ఎస్ పార్టీకి కడుపు మండుతుందని ఓర్చుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. సమాజంలో రాచరిక పాలన కనుమరుగైందని దొరల పాలనను ప్రజలు అంతమొందించారని ఆ తర్వాత కెసిఆర్ కుటుంబ పాలనకు చమర గీతం పాడారని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రాజ్యం ఏలుతున్నాయని దీనిని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అధికారంలో వచ్చేందుకు తాపత్రయ పడుతున్న టిఆర్ఎస్ పార్టీ గడిచిన 15 నెలల్లో అస్తమానం ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే వస్తుందని దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ సెంటిమెంటును ఉద్యమాన్ని వాడుకొని కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కెసిఆర్ మళ్లీ అధికారంలోకి రావడం కల అని అన్నారు. మరో జన్మ ఎత్తిన కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాలేడని స్పష్టం చేశారు. తమ కుటుంబం ముందు సత్యహరిచంద్ర కుటుంబం కూడా దిగదుడుపే అన్న ధోరణితో కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని వారి ప్రవర్తన తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వారు ఎవరు ప్రజలకు మొత్తం తెలుసు అన్నారు.

*మీడియా గ్రహించాలి..*

రాష్ట్రంలో ప్రస్తుతం బిఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు మీడియా గమనించాలని వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు. ప్రజాస్వామ్యంలో వాస్తవాలను ప్రతిబింబించే బాధ్యత మీడియా పైనే ఉందని మీడియా తలుచుకుంటే ఎవరు తప్పు చేసినా చీల్చి చెండాడుతుందని తనకు ఆ నమ్మకం ఉందని ఎవరు తప్పు చేసినా వదలకూడదని ప్రస్తుతం రాష్ట్రంలో రాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్న భాష వ్యవహరిస్తున్న తీరు తప్పుడు పద్ధతులను ఎండగట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ఎంతో ఓపిక పట్టణం ఇకపై ఓపిక పట్టే ప్రసక్తే లేదు.. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ముందుకు సాగుతున్నాం కౌశిక్ రెడ్డి లాంటి వీధి రౌడీలను ఎదుర్కోవడం తమకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య కాదని కాకపోతే ఆలోచిస్తున్నామని మూడు నెలల్లో తప్పకుండా ఫలితం చూపిస్తామని హెచ్చరించారు.

*మీరు సత్యహరిశ్చంద్రులా..?*

సిగ్గుండాలి ఎదుటి వ్యక్తులను మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఏమిటో తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్న కొందరు ప్రతిపక్ష నాయకులు వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో డ్రగ్స్ మూలాలకు ఆధ్యుడు ఎవరో తమకు తెల్వదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మయంగా మార్చిన నాయకుడు గల్లి గల్లి కి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం ఎరులై పారేలా చేసింది ఎవరని ప్రశ్నించారు. డ్రగ్స్ కు బానిసై పట్టుబడి పరీక్షలు చేయొద్దని కోర్టు ద్వారా ఆర్డర్ పొందింది ఎవరని ప్రశ్నించారు. కళాశాలలో గంజాయి చాక్లెట్లు విచ్చలవిడిగా లభిస్తున్నాయని డ్రగ్స్ దొరుకుతుందని దీనిని విస్తృతం చేసిన పాపం ఎవరిదో ప్రజలకు తెలుసని దెప్పి పొడిచారు. ఒరిస్సా పశ్చిమబెంగాల్ ను మించి ఇక్కడ మత్తు వ్యాపారాన్ని నడిపించిన ఘనత అందరికీ ఎరుకే అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తున్న వారికి రాబోయే భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఎవరి సొత్తు కాదని రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ నేడు 42 శాతం బి సి రిజర్వేషన్ తీసుకురావడం ప్రతిపక్షానికి గిట్టడం లేదని అందుకే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందోనని భావించి తప్పుడు ప్రచారాలు తప్పు రాజకీయాలు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒకరు డ్రగ్స్ కు బానిసయితే మరొకరు మద్యం జాతిపితా అని ఎన్ని తలకింద తపస్సులు చేసిన ప్రతిపక్షం అనుకున్నది నెరవేరదని ఎమ్మెల్యే కరాకండిగా చెప్పారు. ఎగిరెగిరి మిడిసిపడుతున్న నాయకుల సంగతి త్వరలోనే తేలుస్తామని ఎమ్మెల్యే శంకర్ నర్మగర్భంగా చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, జంగా నరసింహా యాదవ్, రాజు, శ్రీకాంత్ రెడ్డి, హరేందర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, చెంది తిరుపతిరెడ్డి పురుషోత్తం రెడ్డి బాలరాజ్ గౌడ్, అగ్గనూర్ బస్వం, శ్రీను నాయక్ నెహ్రూ నాయక్ వీర్లపల్లి అన్వర్ దర్శన్ గౌడ్ లింగారెడ్డి గూడ అశోక్ గంగమోని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు