(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం

*అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు అన్నారు*.
నేటి సత్యం. నగర్ కర్నూల్. జులై 29
ఈరోజు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలో ని 15 వా వార్డ్ కి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పథక లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత పాలకులు పేద ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఈ ప్రజా పాలనలో పేద ప్రజల సమస్యలే పరిష్కారం దిశగా ముందుకు వెళుతుందని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలకు ఇల్లా పట్టాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇల్లు నిర్మించిన అనంతరం ఇందిరమ్మ ఇళ్లలోనే మీ ఆహ్వానం మేరకు మన ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో మీ ఇంట్లోనే భోజనం చేసి వస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలోమండల్ అధ్యక్షులు,నాయకులు తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు