Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 10:55 am Editor : Admin

నాగర్ కర్నూల్ జిల్లా సిపిఐ పార్టీ మూడవ మహాసభలను జయప్రదం చేయండి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

నాగర్ కర్నూల్ జిల్లా 3వ మహాసభను జయప్రదం చేయండి

నేటి సత్యం నాగర్ కర్నూల్. జులై 29

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా 3వ, మహాసభలు ఆగస్టు, 1,2 తేదీలలో జరిగే మహాసభల వాల్పోస్టర్లను సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వార్ల వెంకటయ్య గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది,

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని ప్రవేట్ హాల్ లో సిపిఐ మహాసభల వాల్పోస్టర్లను విడుదల అనంతరం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వార్ల వెంకటయ్య, మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశంలో 100 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలు నిర్వహించుటకు ప్రజా సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తున్నది, 1925 డిసెంబర్ 26న ఏర్పడిన సిపిఐ పార్టీ దేశ స్వతంత్రం ఉద్యమంలో పాల్గొని వందలాది మంది నాయకులు దేశం కోసం అమరులైన చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ పార్టీ బ్రిటిష్ ప్రభుత్వం చే నిషేధం గురి అయిన పార్టీ సిపిఐ ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలను కూడగట్టి హక్కుల సాధన కోసం సంఘాలు ఏర్పరిచి పాలకులను ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసిన పార్టీ సిపిఐ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరు జరిగిన ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్వహించింది, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని మహోత్తమమైన తెలంగాణ రైతంగ సైదా పోరాటం నిర్వహించి నిజాం నవాబును గద్దె దించి తెలంగాణ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు రజాకాలనుండి సమాంతర రాజులు, దొరల భూస్వామ్ల నుండి ప్రజలకు వెట్టిచాకి నుండి విముక్తి కల్పించి దున్నేవాడికే భూమి కావాలని నినాదం ఇచ్చింది భూమిలేని ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే దక్కింది అన్నారు,భూమిని పంచిన పార్టీ ఆ పోరాటంలో 400 మంది నాయకులను కార్యకర్తలు కోల్పోయిన వెన్ను చూపకుండా పోరాటం నిర్వహించింది, ఆనాటి నుండి నేటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు అనేక పోరాటంలో ముందుండి ఉద్యమాలు నిర్వహించింది, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను అమ్మకాలను వ్యతిరేకిస్తూ పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యవసరంగా వస్తువుల ధరలను పెంపుదలను వ్యతిరేకిస్తూ దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని దేశవ్యాప్తంగా అనేక ఆందోళన నిర్వహించింది,
నాగర్ కర్నూల్ జిల్లా ప్రజల వ్యవసాయానికి జీవనాధారమైన మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పైన చేపట్టాలని డిమాండ్ చేస్తూ కొల్లాపూర్ నుండి మహబూబ్నగర్ వరకు పాదయాత్ర చేసి కలెక్టర్ కార్యాలయం ముట్టడించడం,ధర్నాలు, రాస్తరోకోలు అప్పటి జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలలో అనేక దఫాలుగా ఆందోళన నిర్వహించి 1987లో నేడు ఎం జి కే ఎల్ ఐ మొదటి పంపు ఉన్న రేగుమాను గడ్డ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి అసెంబ్లీ ముట్టడించిన ఏకైక రాజకీయ పార్టీ సిపిఐ మాత్రమే, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని సాధించడంలో ముందు వరుసలో నిలిచిన పార్టీ సిపిఐ మాత్రమే నాగర్ కర్నూల్ జిల్లాలో లభ్యమవుతున్న వనరులను ఉపయోగించి కాగితం పరిశ్రమలు సిమెంట్ పరిశ్రమలు మామిడి అత్తారింటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకు వస్తున్న పార్టీ సిపిఐ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని నిరంతరం ప్రజల పక్షాన ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న పార్టీ సిపిఐ మాత్రమే, 100 సంవత్సరాలుగా ప్రజల కోసం అనేక బలిదానాలు యాగాలు చేసిన భరత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా మూడో మహాసభలు పూర్తి పట్టణం కేంద్రంలో ఆగస్టు ఒకటి రెండు తేదీలు నిర్వహిస్తున్నాము ఈ సహ మహాసభల ప్రారంభ సందర్భంగా ఒకటవ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రదర్శన 3 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా బహిరంగ సభ దోహదపడుతుందని అన్నారు నాగర్కర్నూల్ జిల్లా నలుమూలల నుండి బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం,
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము భరత్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మారేడు శివశంకర్, సిపిఐ తాడూరు మండల సహాయ కార్యదర్శి ధాంగట్ల వెంకటస్వామి, తాడూరు గ్రామ శాఖ సహాయ కార్యదర్శి గొర్ల సత్యం, ఠాగూర్, శ్రీనివాసులు, ఆంజనేయులు రామకృష్ణ కొండన్న గౌడ్, ఈర్ల నారాయణ, రమేషు, హుస్సేన్ ,పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు,