(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం నారాయణపేట జూలై 29 
*నారాయణపేట మక్తల్ కోడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ముఖ్యమంత్రి గారు యిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి!*
పశ్యపద్మ గారు డిమాండ్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం
*భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలి.*
నారాయణ పేట మండలం పేరపల్ల గ్రామంలో భూ నిర్వాసిత రైతులతో సమావేశం
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(AIKS) ఆధ్వర్యంలో నేడు నారాయణపేట మండలంలోని పేరపల్ల గ్రామంలో భూ నిర్వాసిత రైతులను కలిసి వివరాలు తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశపద్మ గారు
మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ చేస్తున్న ప్రభుత్వ అధికార యంత్రాంగం రైతులతో బలవంతంగా ప్రలోభాలకు గురిచేస్తూ మాయ మాటలు చెప్పి భూసేకరణ చేయవద్దని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం ఇవ్వాలని నారాయణపేట జిల్లా ప్రగతి బాట పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ బహిరంగ సభలో ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శ కామ్రేడ్ పశ్యపద్మ గారు డిమాండ్ చేశారు.
భూములు కోల్పోతున్న రైతులు మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం మేము భూములు ఇవ్వడం సంతోషమే కానీ మాకు సరైన పరిహారం అందడం లేదని భూములను సేకరించడంలో రెవెన్యూ అధికారులు గ్రామాల్లో చేసిన సర్వే తప్పులతడకగా ఉందని భూవిస్తీర్ణ వివరాలు సరిగ్గా సేకరించడం లేదని ఎకరాకు 14 లక్షల రూపాయలు నష్టపరిహారం కేటాయించడం ఎంతవరకు సమంజసం అని బహిరంగ మార్కెట్లో ఎకరాకు 40 లక్షల విలువ ఉందని తర తరాలుగా సాగు చేసుకుంటున్నా భూమిని మేము కోల్పోతే మా జీవనాధారం కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పశ్యపద్మ గారు మాట్లాడుతూ:- నారాయణపేట మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం భూమిని కోల్పోతున్న రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజీ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ బహిరంగ సభలో స్వయానా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు 20 లక్షల రూపాయలైనా సరే రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తామని అభివృద్ధికి అడ్డుపడకండి ఎవరి నా మాటలు నమ్మొద్దని భూసేకరణకు సహకరించండి రైతులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు కానీ రైతులకు న్యాయం చేయండి మీరు చెప్పిన మాట ప్రకారం ఎకరాకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని పశ్యపద్మ గారు డిమాండ్ చేశారు. తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో వారి సొంత ఖర్చులతో పండ్లతోటలు చెట్లు రోడ్లు బావులు బోర్లు పశువుల పాకలు వేసుకున్నారని వాటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు భూనిర్వాసిత రైతులు చేస్తున్న పోరాటానికి తెలంగాణ రైతు సంఘం అండగా ఉంటుందని ఇట్టి సమగ్రమైన విషయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను పరిష్కరించడానికి చొరవ తీసుకుంటానని తెలిపారు
రైతులకు న్యాయమైన పరిహారం అందే వరకు ఈ పోరాటంలో పాల్గొంటామని తెలిపారు ముఖ్యమంత్రి గారు నారాయణపేట జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంత రైతాంగానికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని
అన్ని విధాలుగా వెనుకబాటుకు గురైన నారాయణపేట జిల్లాకు ప్రాజెక్టు తప్పనిసరి అవసరమని మన ప్రాంతానికి నీళ్లు అవసరమని అదే సమయంలో భూనిర్వాసితులకు కూడా సరైన న్యాయం చేయాలని కోరారు గత 14 రోజులుగా భూ నిర్వాసిత రైతులు న్యాయమైన పరిహారం కోసం ఆందోళన చేస్తున్న ప్రభుత్వ అధికారులు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు
భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నారాయణపేట జిల్లా నాయకులు దాసరి చెన్నయ్య నాగరాజు సంతోష్ వెంకటేష్ నరసింహ వెంకటయ్య హనుమంతు ఆశప్ప రాములు పేరపల్ల గ్రామ భూనిర్వాసితుల సంఘం నాయకులు ఆంజనేయులు రాము గోపాల్ తదితరులు రైతులు పాల్గొన్నారు.