Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 11:59 am Editor : Admin

నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని విద్య హబ్ గా మారుస్తా




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

నియోజకవర్గాన్ని విద్యాహబ్ గా మారుస్తా.

ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు .

నేటి సత్యం.నాగర్కర్నూల్. జూలై 29

గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు అన్నారు .
సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో పీఎం శ్రీ పథకం లో ఉత్తమ పాఠశాలల ఎన్నిక కాబడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఆధ్యాపకుల పాత్ర కృషి ఎంతో ఉంటుందని అన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తనకు ఘన స్వాగతం పలికే సందర్భం చూస్తే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని వారిని అభినందించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలని కోరారు పాఠశాలల బలోపేతంతో పాటు ఆధ్యాపకుల కొరత ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరిగిందని గుర్తు చేశారు .
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు గారు,జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ బాబు గారు,ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ గారు తోపాటు మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు ,మాజీ కౌన్సిలర్స్ పాల్గొన్నారు