Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 4:33 pm Editor : Admin

అరాచకాలు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ చేస్తే శిక్షలు తప్పవు డి.ఎస్.పి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నగర్ కర్నూల్

కల్వకోల్ గ్రామం పైన డిఎస్పీ ప్రత్యేక దృష్టి

అరాచకాలు బెదిరింపులు బ్లాక్మెయిలింగ్ చేస్తే శిక్షలు తప్పవు

నాగర్ కర్నూల్ డిఎస్పి శ్రీనివాస్ యాదవ్ వెల్లడి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి సంగం కొండలయ్య / జులై 29 ( నేటి సత్యం)

నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో ఈనెల 12న దారుణ హత్యకు గురైన కె.దామోదర్ గౌడ్ అనే ప్రజల మనిషి హత్యను ఆ గ్రామ ప్రజల ప్రోత్బలం వలనే జరిగిందని వెంటనే ఆ గ్రామంలో కొంతమంది పనిచేయకుండా ఎలాంటి ఉపాధి లేకుండా భార్య పిల్లలను పోషించకుండా హత్యలు చేసుకుంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ జీవిస్తున్నారని దామోదర్ గౌడ్ కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ తో పాటు రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం పైన గతంలో ఆ ప్రాంతంలో ఎస్సైగా పనిచేసిన ప్రస్తుత డిఎస్పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ ఆ గ్రామం పైన దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలోనే మావోయిస్టు ప్రాంతంలో ఎస్సైగా పనిచేస్తూ అనేకమంది మావోయిస్టులను మట్టికరిపించిన ఒక పోలీసు అధికారిగా తిరిగి ఈ జిల్లా ప్రాంతానికి డిఎస్పీగా రావడం పట్ల ప్రజలు అభినందనలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్పెషల్ పార్టీ లో పనిచేస్తూ నల్లమల్ల అటవీ ప్రాంతంలో తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు లెక్కచేయకుండా పనిచేసిన డీఎస్పీ నాగర్ కర్నూల్ డిఎస్పీగా రావడం పట్ల ఆ జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేయడమే కాక దుర్మార్గులను కటకటాల పాలు చేస్తున్నారని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కల్వకోల్ గ్రామం పైన డిఎస్పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ కు ఉన్న సమాచారం ఈ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులు ఎక్కడ కూడా లేదు. నక్సలైట్ ఏరియాలో ప్రతి ఒక్కరి చరిత్ర తెలిసిన వ్యక్తిగా డిఎస్పీగా అనే బాధ్యతలు స్వీకరించడం వల్లనే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. కొంతమంది దుర్మార్గులు చట్టాన్ని చేతులకు తీసుకొని గ్రామాలలో సివిల్ మ్యాటర్ భూత తగాదాల పైన జోక్యం చేసుకుంటూ బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న విషయం డిఎస్పి దృష్టికి పోయినట్లు తెలుస్తుంది. ఈ విషయం పైన డిఎస్పి సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ గ్రామాల్లో రాత్రి 7 గంటల లోపు తమ తమ ఇండల్లోకి వెళ్లిపోవాలని బెల్ట్ షాపులు మద్యం షాపులు వైన్ షాపులను వెంటనే మూసివేయలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు. కల్వకోల్ గ్రామంలో విచ్చలవిడిగా చిన్న పెద్ద తేడా లేకుండా విరంగం చేస్తున్న ప్రజల పైన డిఎస్పి ఉక్కు పాదం మోపుతూ దూరదృష్టితో సీసీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో పెద్దకొత్తపల్లి మండలంలో దారుణంగా అనేక గ్రామాలలో హత్యలు జరుగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అందుకే డిఎస్పి సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నట్లు తొందరలోనే గ్రామాలలో పర్యటిస్తూ ఆ గ్రామంలోని ముఖ్య నాయకులను శాంతి పద్ధతుల విషయంలో చైతన్య చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఏమి జరిగినా కూడా ముందస్తు సమాచారం ప్రకారం శాస్త్రి సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ జీవిత కారాకార శిక్ష విధిస్తూ కుటుంబాలను ఎందుకు పనికిరాకుండా చేయడానికి కూడా వెనకడుగు వేయక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కల్వకోల్ గ్రామం తో పాటు నాగర్ కర్నూల్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అనేక గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవితాలు నాశనం చేసుకోకుండా కుటుంబాలను కాపాడుకోవాలని నాగర్ కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.