నేటి సత్యం శేర్లింగంపల్లి జూలై 29 
*రాజ్యాధికారమే లక్ష్యంగా బోడె రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీలంతా హాజరుకావాలని పిలుపునిచ్చిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్*
రాజ్యాధికారమే లక్ష్యంగా… బడుగుల బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా, బీసీ జాబితా నుంచి తొలగించిన 26+1 బీసీ కులాల గొంతుకను వినిపించడానికి.. బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది.ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ఈ సమావేశానికి బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బీసీల రాజ్యాధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలో చర్చించుకుని బీసీల సమేతంగా పోరాటం చేయాలని అన్నారు. బీసీల ఐక్యమత్యమే బీసీల రాజ్యాధికారం అన్నారు. బీసీలందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని అన్నారు.
వేదిక: హోటల్ వైష్ణవి గ్రౌండ్, కళామందిర్ రోడ్డు, KPHB కాలనీ, కూకట్ పల్లి, హైదరాబాద్.
తేదీ: జూలై 30, బుధవారం సాయంత్రం 6 గంటలకు.