(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం నాగర్ కర్నూల్. జులై 30 


*అఖిల భారత విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నగర్ కర్నూల్ జిల్లా కౌన్సిల్*
విద్యాశాఖ మంత్రి ఉన్నా లేనట్టే విద్యారంగా సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు గారు పూర్తిగా విఫలం. AiSF తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గ్యార క్రాంతి కుమార్
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం జిల్లా కేంద్రం నాగర్ కర్నూల్ లక్ష్మణాచారి భవన్ లో , AiSF జిల్లా అధ్యక్షుడు మధు అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఈ యొక్క విస్తృత కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి కుమార్ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ మంత్రి ఉన్న లేనట్టే అయింది. ముఖ్యమంత్రిగారు తన వద్దనే విద్యాశాఖ ఉన్న నేటికీ ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో,గురుకులాల్లో,మౌలిక సదుపాయాల అభివృద్ధి శూన్యం.మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులను చేర్పించడానికి వారి తల్లిదండ్రులు ముందుకు రాలేనటువంటి పరిస్థితి, గత్యంతరం లేక చేరిన విద్యార్థులకి
మౌలిక సదుపాయాలు లేక అన్ని ఒకే చోట ఉండటం వలన అనోరోగ్యానికి గురి అవుతున్న పరిస్థితి దీనికి తోడు గా గురుకులాల్లో నాణ్యత లేని బియ్యం మరియు శుభ్రత లేని వంటకాలతో విద్యార్థులకి భోజనాలు పెట్టటం వలన రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు అవస్థలకి గురి అవుతున్నారు.మరియు స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్ మెంట్ విషయాలకి వస్తే డిగ్రీలు అయిపోన విద్యార్థులు సర్టిఫికెట్స్ తీసుకోలేని పరిస్థితి,ఉన్నత చదువులు చదువు కోవాలి అన్న డబ్బులు కట్టి సర్టిఫికెట్స్ తీసుకోవాలి అని ప్రభుత్వఓ పై నమ్మకం కోల్పోయి ఇక ఫీజు రియంబర్స్ మెంట్స్ ఎపుడు వస్తాయో తెలీదు మీరు డబ్బులు చెల్లించి సర్టిఫికెట్స్ తీసుకోవాలని,ప్రభ్యత్వం ఇచ్చినపుడు మీకు మరలా తిరిగి ఇస్తాం అని దానికి 50 ,100 రూపాయల బాండ్ పేపర్ ల పై అగ్రిమెంట్ చేసుకొని ఇచ్చే పరిస్థిలో కళాశాల యాజమాన్యాలు ఉన్నాయి అంటే ప్రపంచ స్థాయిలో మన దేశ విద్యా వ్యవస్థ పట్ల గతం లేదా ప్ప్రస్తుత పాలకుల పనితీరు ఎంత దరిద్రంగా ఉంది అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని,ఇంజనీరింగ్ కళాశాలలు ఒక వైపు ఇలా ఐతే మరొక వైపు అడ్మిషన్ల పేరుతో డొనేషన్లు లక్షల్లో వసూళ్లు చేస్తున్నా ఏ ప్రభుత్వాలు అయినా వారిపై స్పందించిన దాకలు లేవని పేద మధ్య తరగతి వారిని దోచుకునే వారికి ప్రభుత్వాలు మేలు చేస్తున్నాయ్ తప్ప మారక ఉద్దేశం లేదు.ప్రతి పేద వాడికి ఉచిత విద్య అని పాలకులు అంటున్నా అది వాస్తవికానికి వచ్చే సరికి శూన్యం దానికి 10 ఇంతలు ప్రైవేట్ యూనివర్సిటీ లకి అనుమతులు ఇస్తున్నారు .ప్రభుత్వ విద్యాలయాలను మూసివేస్తూ ఉన్నటువంటి వాటిని పట్టించుకోక ,ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు పెంచుతున్నారు ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యావ్యస్థ దోపిడీ ప్రజలు మరియు విద్యార్థి లోకo అందరూ భవిష్యత్తు తరాలకు ఉద్యమాన్ని చేపట్టాలని ప్రభుత్వాలకి కనువిప్పు కలిగేలా చేయాలని ,లేదంటి పేద మధ్య తరగతి కుటుంబ జీతాలను ప్రైవేట్ ,కార్పొరేట్ ఫీజుల చెల్లింపులకీ సరిపోవని,ఫీజు నియంత్రణ చట్టం తీసుకు రావాలని వారు డిమాండ్ చేశారు.
అనంతరం AiSF నాగర్ కర్నూల్ జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశంలో నూతన అద్యక్ష కార్యదర్శులుగా గోరటి నరేష్,బలముల ప్రేమ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందని, భవిష్యత్ లో జిల్లాలో సంఘం బలోపేతానికి కృషిచేయాలని ఆగస్ట్ 12న 90 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని విద్యారంగ సమస్యల పై పోరాడాలని అన్నారు.