(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై 30
.
*GHMC నిధులకు గండికోడుతు అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న సర్కిల్ 20 GHMC ఉప కమిషనర్ గారు*
లింగంపల్లి డివిజన్ పరిధిలోని 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని కాంట్రాక్టర్స్ క్లబ్ కు ఎదురుగా అక్రమ నిర్మాణం 2 రెండంతస్తుల నిర్మాణానికి అనుమతులు తీసుకొని ఏకంగా 5 ఐదు అంతస్తులు నిర్మిస్తున్నారు మరియు ఇట్టి నిర్మాణానికి సెల్లార్ కూడా అనుమతులు లేకుండా నిర్మించారు ఇట్టి అక్రమ నిర్మాణం మూడు అంతస్తులు ఉన్నప్పుడే మేము జిహెచ్ఎంసి సర్కిల్ 20 *ఏసిపి వెంకటరమణ* గారికి లిఖితపూర్వకముగా తెలియజేయడం జరిగింది మరియు దాదాపు 25 దినపత్రికలలో కూడా ప్రచురించడం జరిగింది . అయినా కానీ ఇట్టి అక్రమ కట్టడం ఇప్పుడు 6 అంతస్తులు పూర్తి చేసుకోవడం జరిగింది ఇట్టి నిర్మాణానికి TDR తీసుకొని నిర్మించినచో ప్రభుత్వానికి దాదాపు 30 లక్షల రూపాయలు ఆదాయం వస్తుండే మరియు ఇలాంటి అక్రమ నిర్మాణాలు దాదాపు ఏడు ఎనిమిది వందల అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ఇట్టి నిర్మాణాలకు అన్నింటికీ TDR ఇచ్చినచో దాదాపు 200 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసికి ఆదాయం వస్తుండే కానీ ఇక్కడ భారీ ఎత్తున జిహెచ్ఎంసి అధికారులు అవినీతికి పాల్పడడంతో ప్రభుత్వ నిధులకు గండిపడుతూ ప్రజలకు నష్టం జరుగుతుందని నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే మీ మిద్దెల మల్లారెడ్డి మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను ఇప్పటికైనా ఉన్నత అధికారులు సర్కిల్ 20 జిహెచ్ఎంసి అధికారుల పైన పరిశీలించి చర్యలు తీసుకోగలరు