(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శంకర్పల్లి జులై 30 
*కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజలకు రక్షణ*
*ఆగస్టు 2న చలో మొయినాబాద్*
*భారత కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా 17వ మహాసభను విజయవంతం చేయండి*
*సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి పిలుపు*
ఈరోజు శంకర్పల్లి మండల కేంద్రంలో మండల పార్టీ కార్యదర్శి పి సుధీర్ అధ్యక్షతన భారత కమ్యూనిస్టు పార్టీ శంకరపల్లి మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె రామస్వామి హాజరై మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని పార్టీ శ్రేణులతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా 17వ మహాసభలు ఆగస్టు రెండవ తేదీన మొయినాబాద్ మండలంలోని అంజనాదేవి గార్డెన్లో జరుగుచున్నాయని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూణంనేని సాంబశివరావు గారు హాజరవుతున్నారని అదేవిధంగా జిల్లా నలుమూలల నుండి 400 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజలకు రక్షణ ఉంటుందని ఈ మహాసభలలో పార్టీ గ్రామ శాఖల విస్తరణ కోసం పార్టీ బలోపేతం కోసం స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడం కోసం భవిష్యత్తు కార్యాచరణ అదేవిధంగా ఈ మహాసభలలో నూతన కమిటీని ఎన్నుకుంటారని ఒక ప్రకటనలో తెలిపారు ఇండ్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని నియోజకవర్గంలోని చేవెళ్ల మండల కేంద్రంలో 75వ సర్వే నెంబర్లు గుడిసె వేసుకున్న గుడిసెలు వాసులకు పట్టాలు వచ్చేవరకు భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాల్ రెడ్డి అహ్మద్ రవీందర్ మల్లయ్య సువర్ణ మల్లమ్మ యాదమ్మ నరసింహులు రాములమ్మ తదితరులు పాల్గొన్నారు