(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం

*శేరిలింగంపల్లి: 30-07-2025*
*సుందరీకరణతో చెరువులకు పూర్వ వైభవం..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.*
*చెరువుల సుందరీకరణ మరియు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు తెలియచేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు*
*శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న చెరువుల సుందరికరణ, సంరక్షణ, అభివృద్ధి పనులపై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరేఖపూడి గాంధీ గారు, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, సీనియర్ నాయకులు శ్రీ రఘునాథ్ రెడ్డి గారు మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు.*
*ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి లోగల చెరువులలో జరుగుతున్న సుందరీకరణ మరియు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, పనులలో అలసత్వం లేకుండా నిర్ణిత సమయంలో చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, మిగతా చెరువుల అభివృద్ధి పనులకు త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేల చర్యలు తీసుకోవాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.*
*కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ.. కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు గోపిచెరువు, చాకలిచెరువులోకి చేరుతుండటంతో కలుషితం అవుతున్నందున యుద్ధప్రాతిపదికన పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ప్రత్యేక డైవర్షన్ ఏర్పాటుచేసి మురుగునీరు చేరకుండా చూడాలని అందుకు అధికారులు తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. చెరువులను సుందరీకరించి అహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ గారు పేర్కొన్నారు.*
*ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు SE శ్రీనివాస్, EE నారాయణ, DE నళిని, AE లక్ష్మీ నారాయణ, AE శ్రీనివాస్, AE శశాంక్ మరియు తదితరులు పాల్గొన్నారు.*